మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా అయితే నిమ్మ రసానికి దూరంగా ఉండాల్సిందే!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలామంది చిన్న వయసులోనే అధిక శరీర బరువుతో బాధపడుతుంటారు ఇలా అధిక శరీర బరువుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం బోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం కలుపుకొని సేవించడం వల్ల శరీర బరువు తగ్గుతారని ప్రతిరోజు ఉదయం నిమ్మరసం తాగుతుంటారు. నిమ్మకాయ రసాన్ని ప్రతిరోజు సేవిస్తే ఇలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చు. అయితే నిమ్మ రసాన్ని ఏ సమయంలో తాగాలి. ఎన్నిసార్లు తాగాలి అనే విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మరసం అనేది ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగడం ఎంతో మంచిది. అయితే గ్యాస్టిక్, ఉబ్బసం,విరేచనాలు, వాంతులు సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున నిమ్మ పానీయాన్ని సేవిస్తే నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ సమస్యను మరింత తీవ్రతం చేస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నోళ్లు భోజనం చేసిన తర్వాత అరగంటకు నిమ్మ పానీయాన్ని సేవించడం మంచిది.

నిమ్మకాయల్లో అధికంగా ఉండే సిట్రిక్ యాసిడ్ , విటమిన్ సి ఐరన్ ను గ్రహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కావున ప్రతిరోజు నిమ్మ రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్లు మనం తీసుకునే ఆహారంలో ఐరన్ ను సమృద్ధిగా గ్రహించి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. దాంతో అలసట, నీరసం, కళ్ళు తిరగడం, తలనొప్పి వంటి అనేక సమస్యలు తొలుగుతాయి. నిమ్మకాయలు సమృద్ధిగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా చేసి వృద్ధాప్య చాయాలను అరికడుతుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో నిమ్మకాయ రసం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. లివర్ ఇన్ఫెక్షన్లను అదుపు చేసి ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.