ఆరోగ్యం కోసం వాడే వంట నూనె విషయంలో అజాగ్రత్తగా ఉంటే తీవ్ర పరిణామాలు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త!

వంట నూనెలు వాడే విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే భవిష్యత్తులో ప్రాణాంతక అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రమాదం ఉంది.కొంత మంది స్వార్థం కోసం ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారు. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్,రెస్టారెంట్స్ లో సాధారణంగా ఒకసారి వినియోగించిన అన్ని రకాల వంట నూనెలను
తక్కువ ధరకే మళ్లీ విక్రయించడం జరుగుతుంది. అలాంటి వంట నూనెను కొంతమంది సేకరించి తిరిగి ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు.

ఎక్కువసార్లు వాడిన నూనెలు కావడంతో వీటి ధర తక్కువగా ఉంటుంది. ఆ విషయం తేలిక మనం ఆ నూనెలనుకొని ఎక్కువసార్లు వేడి చేసి ఉపయోగించడం వల్ల తీవ్ర అనారోగ్యాలు కలగడంతో పాటు మన పిల్లల ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్లు, ఎంజైముల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో పిల్లలు మానసిక, శారీరక ఎదుగుదలలో తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఎక్కువసార్లు వేడి చేసిన నూనెలను పదేపదే వాడుతుంటే శరీరంలో జెనోటాక్సిక్, మ్యూటాజెనిక్, కార్సినోజెనిక్ కార్యకలాపాలు పెరుగుతాయి. కణాలలో అవాంతరాలు మొదలవుతాయి. వాటి విచ్ఛిన్నం వేగం పెరిగి క్రోమోజోమ్‌లు దెబ్బతింటాయని పలు పరిశోధనలో తేలింది.

మన ఆరోగ్యం కోసం వాడే వంటనూనెలను పదేపదే ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల అందుల ఉండే విటమిన్ డి ఈ వంటి పోషక విలువలు నశించడమే కాకుండా అవ్వి అల్డీహైడ్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతుంది తద్వారా గుండె సంబంధిత వ్యాధులు, మెదడు వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకు కారణమవుతుంది.అధిక మంటపై నూనెలో ఏదైనా వేయించినప్పుడు దాని నుంచి వెలువడే పొగలో 200 కంటే ఎక్కువ రకాల వాయువులు ఉంటాయి ఇది కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న పొగ కారణంగా న్యుమోనియా, రినిటిస్ ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి.