రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే శుభవార్త ఇదే.. తక్కువ ధరకే వంటనూనె పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత కొంతాకాలంగా వంటనూనెల ధరలు ఊహించని స్థాయిలో తగ్గుతున్నాయి. రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. వంటనూనెల ధరలు తగ్గడం వల్ల సామాన్య ప్రజలపై భారం తగ్గుతోంది.

 

గ్రౌండ్ నట్ ఆయిల్ మినహా మిగతా అన్ని ఆయిల్స్ పై రేట్లు తగ్గుతుండటం గమనార్హం. అయితే రాబోయే రోజుల్లో సబ్సిడీ ధరలకే వంట నూనె పొందే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే వంటనూనెను అందిస్తామని కీలక ప్రకటన చేసింది. 110 రూపాయలకే లీటర్ కుకింగ్ ఆయిల్ ను పొందే అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండటం గమనార్హం.

 

గతంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువ ధరలకే వంటనూనెను విక్రయించేవారు. అయితే ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ విధంగా చేయడం లేదు. రాబోయే రోజుల్లో అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తాయేమో చూడాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేయాలని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

 

పెద్దగా ప్రయోజనం లేని పథకాలను అమలు చేయడం కంటే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే పథకాలను అమలు చేస్తే ప్రజలకు సైతం ఊహించని స్థాయిలో బెనిఫిట్ లభించే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో అయినా వంటనూనెల తగ్గింపు దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అడుగులు వేస్తాయేమో చూడాలి.