డీప్ ఫ్రై చేశాక మిగిలిపోయిన నూనెను వాడుతున్నారా.. ఈ ప్రమాదకర సమస్యలు వస్తాయట!

వంటనూనె విషయంలో ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కో విధంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం మంచిది కాదని వైద్య నిపుణులు చాలా సందర్భాల్లో చెబుతారు. వాడిన నూనె మళ్లీ వాడితే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశంతో పాటు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశాలు అయితే ఉంటాయి. పూరీలు, పకోడీలు, బజ్జీలు ఇలా ఏ వంటలు చేయాలన్నా కొంచెం నూనె మిగిలిపోతుంది.

మార్కెట్ లో వంటనూనె ఖరీదు ఎక్కువ కావడంతో ఈ నూనెను వేస్ట్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్‌, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్‌ తదితర అనారోగ్య సమస్యలు వాడిన నూనెను మళ్లీ వాడటం వల్ల వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చాలాసార్లు వినియోగించిన నూనె ఫ్రీరాడికల్స్‌ను సృష్టించడంతో పాటు క్యాన్సర్, ధమనులు బ్లాక్, ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలకు కారణమవుతుంది.

మంచి కొలెస్ట్రాల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెడు కొలెస్ట్రాల్ వల్ల అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ గుండె ఆరోగ్యానికి హాని
చేయడంతో పాటు ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నూనె కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కు సైతం కారణమవుతుంది. తినడానికి కాకుండా ఇతర అవసరాల కోసం ఈ నూనెను వాడితే మంచిది.

డబ్బులు వేస్ట్ అవుతాయని నూనెను పదేపదే వాడితే మాత్రం ప్రమాదకర ఆరోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకున్నట్టే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నూనెను వాడితే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ పెరగడంతో పాటు క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ వంటనూనెను వాడితే ఆహారంలో కొవ్వు అంటుకుంటుందని కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పవచ్చు.