మనం తీసుకునే ఆహారంలో ఇవి లోపిస్తే… కంటి చూపును కోల్పోవాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లల్లో కంటి సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నాయని . ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాహార లోపం, పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం,కంప్యూటర్ మొబైల్ ను సమయానికి మించి ఎక్కువగా ఉపయోగించడం వంటి ప్రధాన కారణాలు కంటి సమస్యలకు కారణం అవుతున్నాయి.కంటి సమస్యలను తొలగించి కంటి చూపును మెరుగుపరచుకోవడానికి ప్రతి రోజు మన ఆహారంలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజు ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడంతో పాటు ముఖ్యంగా పాలకూర రసాన్ని కొద్దిగా సేవిస్తే
ఇందులో ఉండే విటమిన్ ఏ, డి, కె, సి ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు కంటి చూపును మెరుగు పరచడంతో పాటు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.పాలకూర లో ఉన్న బీటా కెరోటిన్‌ కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని నిరోధిస్తాయి

ముఖ్యంగా చేపల్లో విరివిగా లభించే విటమిన్ ఏ, ఈ ఒమేగా-3 ఫాటీ ఆమ్లం అనేక కంటి సమస్యలను నయం చేసి రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

బాదం పప్పు,మిస్ట్రీ,సోంపు మిశ్రమాన్ని పొడిగా చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాలలో కలిపి సేవిస్తే ఇందులో ఉండే ఔషధ గుణాలు భవిష్యత్తులో వచ్చే అనేక కంటి సమస్యలను నివారిస్తుంది.

క్యారెట్లు లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కావున ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ ను ఉదయం సాయంత్రం సేవిస్తే కంటిచూపు మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఉసరి రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి సమస్యలను తొలగిస్తుంది.

బ్లూ బెర్రీ లో పుష్కలంగా లభించే యాంథోసైనిన్స్‌ ఆమ్లం,విటమిన్‌-సి కళ్ళు పొడిబారడం, రే చీకటి వంటి సమస్యలను తొలగించి కంటిచూపును మెరుగుపరుస్తుంది.

కర్బూజా పండు కంటి సమస్యలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కావున బాగా పండిన కర్బూజాను, కీర దోసకాయను కలిపి జ్యూస్ చేసి ప్రతిరోజు సేవిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది.