ఎముకల దృఢత్వం కోల్పోయినట్లు అనిపిస్తోందా… జాగ్రత్త పడండి?

ఈ రోజుల్లో ఎముకల సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి దీనిని ఆస్థియోఫోరోసిస్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని వైద్య నిపుణులు చెప్తున్నారు.పోషకాహార లోపం, జన్యు లోపం వల్ల చిన్న వయసులోనే ఆస్తియో ఫోరోసిస్ వ్యాధికి గురైన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నడంతో సమస్య మరీ తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆస్తియోఫోరోసిస్ అంటే ఎముకలు వాటి సహజ దృఢత్వాన్ని కోల్పోయి బోలుగా మారడాన్ని ఆస్తియోఫోరోసిస్ అంటారు. సాధారణంగా ఈ వ్యాధి 50 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే వస్తుంది.
పోషకాహార లోపం,మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలతో చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి సోకితే ఎముకలు పెళుసుగా మారి విరిగిపోతాయి.ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలతో దీర్ఘకాలం పాటు బాధ పడాల్సి వస్తుంది.

ఆస్తియోఫోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మన ఆహారంలో తప్పనిసరిగా కాల్షియం ,విటమిన్ డి, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్న పాలు ,పెరుగు ,గుడ్లు, బ్రోకలీ, ఆకుకూరలు, చేపలు వంటి ఆహారాన్ని క్రమం తప్పకుండా మన ఆహారంలో చేర్చుకోవాలి. బత్తాయి నారింజ పండ్లలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.ఒక నారింజ పండులో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.ప్రతిరోజు నారింజ పండు జ్యూస్ ను తాగితే ఎముకలు దృఢత్వానికి తోడ్పడతాయి. వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ప్రతిరోజు కాల్షియం అధికంగా ఉన్న డ్రై ఫ్రూట్స్, అంజీర పండును, ఖర్జూర పండును ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఎముకల దృఢత్వం కోల్పోయిన వారు టెస్టోస్టిరాన్ థెరపీ చేయించుకుంటే ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే ప్రతి రోజు క్యాల్షియంతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక వంటివి అలవాటు చేసుకుంటే ఎముకలు దృఢంగా మారడంతో పాటు కీళ్ల సంబంధం వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.