ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా సమీప దూరానికి వెళ్లాలన్నా కూడా ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు తద్వారా రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా ఎన్నో రకాల చర్మ సంబంధిత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వాయు కాలుష్య తీవ్రత కారణంగా ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు చర్మంపై దద్దర్లు, దురద, మొటిమలు,సోరియాసిస్,చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు తలెత్తుతున్నాయి.
ఈ విధంగా వాతావరణ కాలుష్యం కారణంగా వాయు కాలుష్యం జల కాలుష్యం జరుగుతుంది ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా వెలువడి పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు, అస్థిర కర్బన సమ్మేళనాలు, ఆక్సైడ్‌లు చర్మంపై తీవ్ర ప్రభావం చూపి చర్మం లోపల ఉండే లిపిడ్లు, డియోక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్, ప్రొటీన్ల పనితీరులో మార్పులు ఏర్పడుతాయి. ఫలితంగా చర్మ అలర్జీలు తలెత్తి దద్దర్లు ,మంట, వాపు, చర్మ క్యాన్సర్లు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ విధంగా ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా కాటన్ దుస్తులను బదులుగా ఉండే దుస్తులను వేసుకొని వెళ్లాలి అలాగే స్కార్ఫ్ ధరించి బయటకు వెళ్లాలి. ఇక బయట నుంచి వచ్చిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేసే అలవాటు చేసుకోవాలి. చర్మంలోని మృత కణాలను, మలినాలను తొలగించే ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసేటప్పుడు మృదువైన, వృత్తాకార మసాజ్ చేయాలి. యాంటీఆక్సిడెంట్లను రోజువారీ చర్మ సంరక్షణలో చేర్చవచ్చు. అలాగే శీతాకాలంలో చర్మం పొడిబారకుండా సహజమైన కొబ్బరినూనె బాదం నూనెలను ఉపయోగించాలి. వీటితోపాటు సరైన పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిది.