మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో వాము గురించి విని ఉంటారు. వాము తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. వాము తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు సులభంగా చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గించడంలో వాము ఎంతగానో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో వామును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆయుర్వేదంలో వాముకు ఎంతో ప్రాధాన్యత ఉండగా చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో, పొట్ట సంబంధిత సమస్యలను తగ్గించడంలో వాము తోడ్పడుతుందని చెప్పవచ్చు. మహిళలకు రుతుక్రమంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడంలో వాము ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఫుడ్ ఎక్కువగా తీసుకున్న సమయంలో వచ్చే అజీర్తి సమస్యలను సైతం వాము సులువుగా దూరం చేస్తుంది.
వామును నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. వాము వాటర్‌ను తయారు చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కోడిగుడ్డును పొడి చేసి దానికి పెరుగు, వాము మిశ్రమాన్నికలిపి తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. చట్నీల తయారీలో వామును ఉపయోగించడం ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.
టీ, సలాడ్, డిష్ లలో కూడా వాము ఆకులను వినియోగించవచ్చు. జ్యూస్ తయారు చేసే సమయంలోకూడా వామును వాడటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. వాము తినడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది.