డ్రై ఫ్రూట్స్ లలో రారాజుగా పిలువబడే జీడిపప్పును ప్రతిరోజు తింటే.. మన గుండె ఆరోగ్యం భద్రమేనా?

అత్యధిక పోషక విలువలు ఉన్న జీడి పప్పును మన రోజువారి ఆహారంలో క్రమం తప్పకుండా గుప్పెడు తీసుకున్నట్లయితే పోషకాహార లోపాన్ని తొలగించుకోవచ్చు. అంతేకాకుండా మన నిత్య జీవక్రియలు సక్రమంగా జరగడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్, కెరోటినాయిడ్స్ ప్రోటీన్స్,విటమిన్, పొటాషియం, పాస్ఫరస్, ఫైబర్, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా ఆరోగ్యవంతమైన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు.అయితే ప్రతిరోజు జీడిపప్పును తినడం వల్ల శరీర బరువు పెరిగి అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని చాలామంది జీడిపప్పును తినడం మానేస్తున్నారు.అది కొందరి అపోహ మాత్రమే

తాజా అధ్యయన ప్రకారం వారానికి ఒకటి లేదా రెండు సార్లు రెండు గుప్పిళ్లు జీడిపప్పులు తినేవారిలో గుండె జబ్బు ప్రమాదం 20 నుంచి 23శాతం తక్కువగా ఉంటుందని తేలింది. దీనికి కారణం జీడిపప్పులో అధికంగా ఉండే మెగ్నీషియం మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సమర్ధవంతంగా కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో అధికంగా ఉండే పీచు పదార్థం మలబద్దకం చిన్న పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి
జీర్ణ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.

గుండె పనితీరును దెబ్బతీసే సోడియం జీడిపప్పులో తక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచే పొటాషియం అధికంగా ఉంటుంది కావున రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి హై బీపీ, లోబీపీ వంటి సమస్యలు దరి చేరవు. కావున జీడిపప్పును నిక్షేపంగా గుండె జబ్బు ఉన్నవారు తక్కువ పరిమాణంలో చేసుకోవచ్చు.

జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి శరీరంలో క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే సీజనల్గా వచ్చే వ్యాధులను ఎదుర్కోవడానికి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచి మనల్ని సిద్ధంగా ఉంచుతుంది. అలాగే జీడిపప్పులో ఉండే క్యాల్షియం, జింక్, మెగ్నీషియం ఎముకలు దృఢత్వానికి తోడ్పడి వృద్ధాప్యంలో వచ్చి ఆర్థరైటిస్, కీళ్ల సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. జీడిపప్పు పరిమితంగా కాకుండా అతిగా తిన్నట్లయితే మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది అనేది మర్చిపోకండి.