నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినేవాళ్లకు అలర్ట్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కుళ్ళిపోకుండా ఉండటానికి ఎండబెట్టిన పండ్లను డ్రై ఫ్రూట్స్ అంటారనే సంగతి తెలిసిందే. ఇవి రుచిగా ఉండడంతో పాటు, పోషకాలను కూడా అందించడంలో ఎంతగానో సహాయపడతాయి. బాదం, కాజు, వాల్‌నట్స్, పిస్తా, డేట్స్, అంజీర్, కీవి, ఆప్రికాట్స్, బెర్రీస్ తినడానికి ఎంతో రుచిగా ఉంచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో డ్రై ఫ్రూట్స్ ను సులువుగా కొనుగోలు చేయవచ్చు.

డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తింటే ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. పరగడుపున నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. గ్యాస్, అజీర్తి సమస్యలకు చెక్ పెట్టడంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఎక్కువగా ఉంటాయి.

నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు సులువుగా అందుతాయని చెప్పవచ్చు. నీటిలో నానబెట్టిన వాల్ నట్స్ ను తినడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు దరి చేరే ఛాన్స్ అయితే ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు. ఓట్స్ ను నానబెట్టి తీసుకుంటే సులువుగా గుండె సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

రాత్రంతా నానబెట్టిన కిస్ మిస్ లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప నష్టం లేదు. అయితే మరీ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు.