ఈ లక్షణాలు కనిపిస్తే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టే.. వాళ్లకు చాలా ప్రమాదమంటూ?

Heart, stethoscope and EKG

ప్రస్తుత కాలంలో చాలామందిని గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల 30 సంవత్సరాల వయస్సులోనే గుండె సంబంధిత సమస్యల బారిన పడి ఆస్పత్రులలో చేరి చికిత్స పొందుతున్న వాల్ల సంఖ్య పెరుగుతుంది. విపరీతమైన అలసట ఉంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తరచూ అలసట సమస్య వేధిస్తుంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

ఒకసారి గుండె సమస్యల బారిన పడితే దీర్ఘకాలంలో ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశం అయితే ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే కూడా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలు వేధించడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే గుండెకు సంబంధించిన సమస్యలు వేధిస్తాయి. ఛాతీలో తరచూ నొప్పి ఉన్నా గుండె సమస్యలు కావచ్చు.

తరచూ తల తిరగడం, డీ హైడ్రేషన్ సమస్యలు తరచూ వేధిస్తుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే మీ గుండె బలహీనంగా ఉందని గుర్తుంచుకోవాలి. రక్తపోటు అధికంగా ఉంటే కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జలుబు సమస్య తరచూ వేధిస్తున్నా గుండె సంబంధిత సమస్యలు కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు భవిష్యత్తులో రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యల వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు.