మహిళలలో ఈ లక్షణాలు ఉంటే మాత్రం ప్రాణాలకే ప్రమాదమట.. ఆ తప్పులు మాత్రం చేయొద్దంటూ?

ఈ మధ్య కాలంలో కొత్తకొత్త వ్యాధుల వల్ల చాలామందికి ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా మహిళలు వేర్వేరు క్యాన్సర్ల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ వ్యాధి ఎంత ప్రమాదకరమైన వ్యాధి అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే మహిళలు ఈ వ్యాధి బారిన పడకుండా రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

రొమ్ము కణజాలంలో మార్పులు వస్తున్నా, బరువు తగ్గుతున్నా, తీవ్ర రక్తస్రావం అవుతున్నా, అలసట వల్ల ఇబ్బంది పడుతున్నా, చర్మంలో మార్పులు వస్తున్నా ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఈ సమస్యలు ఉంటే క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటే మంచిది. క్యాన్సర్ పరీక్షల వల్ల వ్యాధి బారిన పడ్డామో లేదో తెలుసుకోవడంతో పాటు సరైన సమయంలో చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మహిళలు ఎప్పటికప్పుడు శరీరంలో వస్తున్న మార్పులను గమనించి చికిత్స చేయించుకోవాలి. క్యాన్సర్ స్టేజ్ ను బట్టి చికిత్సలో మార్పులు ఉంటాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమందిని ఈ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. క్యాన్సర్ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతులు అయినవాళ్లు కూడా ఎక్కువమంది ఉన్నారు.

క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వాళ్లకు ఉచితంగా చికిత్సను అందించే ఆస్పత్రులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. క్యాన్సర్ బారిన పడిన వాళ్లకు ఆరోగ్య శ్రీ లాంటి పథకాల వల్ల కూడా చికిత్స చేయించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.