సాధారణంగా వర్షాకాలం మొదలు అయితే ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. వాతావరణంలో ఒకసారిగా మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో ఇంటి పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగడం నీళ్లు నిలబడడం వంటివి జరగడం వల్ల పెద్ద ఎత్తున దోమలు కూడా పెరుగుతాయి. ఇలా దోమలు కుట్టడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో ఎవరైతే ఎక్కువగా చలితో జ్వరం రావడం, ఒళ్ళునొప్పులు, శరీరం నుంచి చెమటలు బయటకు వెళ్లడం, వంటి లక్షణాలు కనుక కనబడితే వెంటనే మలేరియా పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉత్తమం. ఈ విధమైనటువంటి లక్షణాలు కనబడితే మలేరియాతో బాధపడుతుంటారు.మలేరియా ఆడ ఇనాఫిల్ దోమ కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుంది ఇది ఎక్కువగా నీళ్లు నివసించే ప్రాంతంలో పెరుగుతుంది కనుక మన ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో నీటి నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి.
ఉదయం శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి పగలంతా అధికమైన జ్వరంతో బాధపడుతుంటే తప్పనిసరిగా అది టైఫాయిడ్ కావచ్చు. టైఫాయిడ్ వర్షాకాలంలో సర్వసాధారణంగా వచ్చే జబ్బు. వర్షాలు పడటం వల్ల ఎక్కువగా నీరు కలుషితమవుతాయి. ఇలాంటి కలుషితమైన నీరు ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీలైనంతవరకు ఎప్పటికప్పుడు ఫుడ్డు తయారు చేసుకుని తినడం అలాగే నీటిని మరిగించి తాగడం ఎంతో మంచిది.
ఎవరైతే జ్వరంతోపాటు తలనొప్పి, శరీరంలో నొప్పులు, కళ్ళు మండడం,చర్మంపై దద్దులు ఏర్పడటం వంటి లక్షణాలు కనబడతాయో అలాంటివారు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారని అర్థం. డెంగ్యూ ఆడ ఎడిస్ దోమ కాటు వల్ల వస్తుంది.ఇలా మన శరీరంలో ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక కనబడితే ఏమాత్రం అలసత్వం చేయకుండా వెంటనే సరైన పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్య లేదంటే ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి.