షుగర్ ఉన్నవాళ్లు ఇవి తింటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త!

మా ఇంట్లో డయాబెటిస్ ఎవరికి లేదు అని చెప్పుకునే కుటుంబాలు చాలా అరుదు. దాదాపు చాలామంది షుగర్ బారిన పడి బాధపడడం మనం చూస్తూ ఉంటాం. షుగర్ రావటం అనేది మన జీవనశైలి ఆధారపడి ఉంటుంది. అయితే మన శరీరంలోని ప్యాంక్రియాస్ బీటా సెల్ విడుదల చేస్తుంది. అందులోని ఇన్సులిన్ లోపం వల్ల వచ్చేదే షుగర్.

అంటే రక్తంలో షుగర్ లెవెల్ పెరగడం వలన రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం, దీని ప్రభావం గుండెపై పడడం లాంటివి జరుగుతుంది. ఇలా అయినప్పుడు షుగర్ వచ్చింది అని కన్ఫామ్ చేసుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్లు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా మోతాదుకు మించకుండా పాటించవలసి ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్లు తేనె, బెల్లం, చక్కెర లను అస్సలు తీసుకోరాదు.

ఉప్పు కూడా తక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిది. ఇంకా రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు వేడివేడిగా తీసుకోవడం చాలా మంచిది. కారం ఒక రకంగా బాగానే తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్లు స్వీట్ గా ఉండే పండ్లు సీతాఫలం, పనసకాయ, అరటిపండు ఇంకా మామిడిపండు లాంటి ఫలాలు అస్సలు తినకూడదు. ఇంకా షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తీసుకోవలనుకుంటే ఆ సమయంలో తక్కువ ఆహారం తీసుకొని ఉంటే సరిపోతుంది.

కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే ఆహారం కొద్దిగా తీసుకోవాలి. ఇంకా కొంతమంది కాకరకాయ ను తీసుకుంటే అది షుగర్ తగ్గిస్తుంది అని అంటారు వాస్తవానికి అది నిజమే అయినా మనం బయటి నుండి తీసుకునే ఆహారం తక్కువ మోతాదులో ఉండి డైలీ ఫాలో అవుతూ ఇంకా వాకింగ్ లాంటివి చేసుకుంటూ ఈ కాకరకాయ రసం ను తీసుకుంటే మంచిదే..

కానీ మనం మన ఆహారాల వాట్లను మార్చుకోకుండా ఎక్కువ ఆహారంను తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. చూశారుగా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎలా తమ డైట్ ను ఎలా ఫాలో కావాలో. కాబట్టి మోతాదుకు మించి తీసుకున్న ఆహారం ఒక రకంగా చెప్పాలంటే విషం లాంటిది .కావున ఈ ఆహార అలవాటులను పాటిస్తే తప్పకుండా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది.