మనలో చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలలో ముఖంపై మొటిమలు, మచ్చలు సమస్య కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సమస్య చిన్న సమస్యగా అనిపించినా ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ల సంఖ్య కోట్లలో ఉంది. కొంతమంది ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి సబ్బులు, క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ప్రతిరోజూ పండ్లను తీసుకోవడం ద్వారా ముఖంపై మొటిమలు, మచ్చలు, ఇతర సమస్యలు దూరమవుతాయి. నారింజ పండ్లు, అరటి పండ్లు, ఆపిల్స్, దానిమ్మ, నిమ్మ, బొప్పాయి తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫేస్ ను శుభ్రం చేసుకుని తేనెలో పంచదార వేసి ముఖంపై స్క్రబ్ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ విధంగా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆపిల్ జ్యూస్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు దక్కుతాయి. దూదిని ఆపిల్ జ్యూస్ లో ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. బొప్పాయి పండు గుజ్జులో శెనగ పిండి, ముల్తానీ మట్టి కలిపి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
శరీరానికి మాయిశ్చరైజర్ రాయడం ద్వారా మంచి ఫలితాలు సొంతమవుతాయి. దానిమ్మ గుజ్జు, నిమ్మరసాన్ని ఉపయోగించి ముఖాన్ని స్క్రబ్ చేయించడం ద్వారా కూడా అనుకూల ఫలితాలను పొందవచ్చు. పసుపు, అర టీస్పూన్ శనగపిండిని పేస్ట్ లా చేసుకుని ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది. క్యారెట్ మాస్క్ వేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.