ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వేధించే ఆరోగ్య సమస్యలతో మొటిమల సమస్య కూడా ఒకటి. ఈ సమస్య చాలామందికి చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. శరీర తత్వాలను బట్టి మొటిమలు వచ్చే అవకాశం ఉండగా కాలుష్య కారకం, నిద్రలేమి, జీవనశైలి, ఇతర సమస్యలు మొటిమల సమస్యకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.
ఐస్ ప్యాక్ ను ఉపయోగించడం ద్వారా మొటిమల సమస్య సులభంగా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఐస్ క్యూబ్ ను మొటిమలపై ఉంచడం ద్వారా సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. సమస్యను త్వరగా, తక్కువ సమయంలో తగ్గించడంలో ఐస్ క్యూబ్స్ తోడ్పడతాయని చెప్పవచ్చు. శనగపిండి ప్యాక్ ద్వారా కూడా మొటిమల సమస్య సులువుగా దూరమవుతుంది. శనగపిండి ప్యాక్ ను స్క్రబ్ లా అప్లై చేస్తే మంచిది.
వెల్లుల్లిని చిదిమి మొటిమలపై రాయడం ద్వారా కూడా మొటిమల సమస్య దూరమవుతుంది. ఆపిల్ స్లైస్ ను ముఖంపై రబ్ చేయడం ద్వారా కూడా జిడ్డుకు చెక్ పెట్టవచ్చు. ఆపిల్ సిడర్ వెనిగర్ ను ముఖానికి అప్లై చేయడం ద్వారా కూడా మొటిమల సమస్య దూరమవుతుంది. ఆయిల్, నిమ్మరసం ముఖానికి అప్లై చేయడం ద్వారా బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గే అవకాశం ఉంటుంది.
ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ వేసి కలిపి ప్యాక్‌లా చేసి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే కూడా మొటిమల సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు. బియ్యం పిండి, పెరుగు మిశ్రమం కలిపి ముఖానికి అప్లై చేయడం ద్వారా కూడా సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తేనె, దాల్చిన చెక్క పొడిని ముఖానికి అప్లై చేసినా మంచి ఫలితాలను పొందవచ్చు. టమాటా ప్యాక్ కూడా మొటిమల సమస్యకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.