వంటింటి చిట్కాలతో దంతాల సహజ అందాన్ని పెంపొందించుకోవచ్చు ఎలాగంటే?

ఈ రోజుల్లో చాలామంది చిన్న వయస్సులోనే తీవ్రమైన దంత సమస్యలను ఎదుర్కొంటున్నారు. దంతాలను నిర్లక్ష్యం చేస్తే దంతాల దృఢత్వానికి, సహజ తెల్లదనానికి సహాయపడి ఎనామిల్ పొర దెబ్బతిని వాటి సహజ గుణాన్ని కోల్పోయి పచ్చగా అంద విహీనంగా మారుతాయి. దాంతో చాలామంది నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడడానికి సంకోచిస్తుంటారు.ఎనామిల్ పొర దెబ్బతీయడానికి కారణం మన రోజువారి ఆహారపు అలవాట్లు కూడా కారణం కావచ్చు. దంతాల సంరక్షణకు కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగిస్తే అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దంతాలను శుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే గార పట్టి పచ్చగా మారుతాయి. ఇలాంటివారు మన ఇంట్లో కచ్చితంగా ఉండే నిమ్మరసంలో వంటసోడాను మెత్తని పేస్టులా కలుపుకొని మన దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలపై ఉండే పసుపు రంగు తొలగిపోతుంది. నిమ్మకాయ లో ఉండే విటమిన్ సి దంతాల చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఎన్నో ఔషధ గుణాలున్న తులసి ఆకుల్నిఎండబెట్టి పొడి చేసి ఆ తులసి పొడితో ప్రతిరోజూ దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలపై ఉండే పసుపు వర్ణం తొలగిపోవడమే కాకుండా దంత సమస్యలకు దూరంగా ఉంచవచ్చు.

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న లవంగాలను పొడిచేసి దానితో దంతాలపై రుద్దుకోవాలి. ఇలా చేయడంవల్ల దంతాలు తళతళా మెరవడమే కాకుండా దృఢంగా కూడా ఉంటాయి.ఒక స్పూను కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని ఆయిల్ ఫిల్లింగ్ చేస్తే మన శరీరంలోని విష పదార్థాలను తొలగించడమే కాకుండా దంతాలపై ఉండే హానికర బ్యాక్టీరియాను తొలగించి దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. బాగా పండిన స్ట్రా‌బెర్రీలను తీసుకొని అందులో వంట సోడా కలిపి మెత్తని పేస్టులా చేసి దంతాలపై మర్ధన చేయడం వలన స్ట్రా‌బెర్రీలో ఉండే యాసిడ్‌లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి సహాయపడతాయి.