Palm Oil: వంటల్లో పామ్ ఆయిల్ వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!!

Palm Oil: నేడు మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా నూనె విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నూనెలో కల్తీ, తేడాల వల్ల ఏకంగా గుండె సమస్యలు వస్తాయి. బయట హోటళ్లలో తయారు చేసే టిఫిన్లు, బండి మీద వేసే బజ్జీ, పకోడీ, స్వీట్ స్టాల్స్ లో నూనె పదార్ధాలు.. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని శాసిస్తున్నవే. ఒకసారి మరిగిన నూనెలో మళ్లీ వేరే పదార్ధాలు వండకూడదు. కానీ.. బయట జరుగుతోంది ఇదే. ధర తక్కువని చాలా హోటళ్లు, బండ్ల వద్ద, కొందరు ఇళ్లలో కూడా ఇదే నూనె వాడుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి హానీ చేస్తుంది తప్ప లాభం చూకూర్చదని అంటున్నారు డాక్టర్లు.

దేశంలోని చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉపయోగిస్తోంది పామ్ అయిలేనని ఓ వాదన. ఎందుకంటే దీని ధర తక్కువ. మిగిలిన నూనెల ధరలు పామ్ ఆయిల్ తో పోలిస్తే ఎక్కువ. పామ్ ఆయిల్ వాడకం అంటే.. మద్యం, స్మోకింగ్ రెండింటి వల్ల వచ్చే నష్టాల కంటే ఎక్కువ అని అంటున్నారు. ప్రపంచంలో పామ్ ఆయిల్‌ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం మనం. ఇదొక మాఫియా అనేవాళ్లూ లేకపోలేదు. పామ్ ఆయిల్‌తో కలిగే నష్టాలు దాదాపు ఎవరికీ తెలియవు.. పైగా టేస్ట్ కూడా తేడా ఉండదు. అందుకే ఈ నూనెతో చేసిన వంటకాల్ని తినేస్తున్నారు.

బిస్కెట్లు, చాక్లెట్లు, కుకీలు తయారీలో పామ్ ఆయిల్‌ వాడకమే ఎక్కువ. నే వాడుతున్నారు. చాకొలెట్స్ తయారీలో కూడా అదే. పేరుమోసిన కంపెనీలు జంక్ ఫుడ్స్ కు విదేశాల్లో అదే ప్రొడక్టుకు మంచి నూనె వాడి.. భారత్ లో మాత్రం పామ్ ఆయిల్ వాడుతున్నారని అంటున్నారు. కానీ.. పామ్ ఆయిల్ లేదా పాల్మిటిక్ యాసిడ్ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పిల్లలకు వారి బ్రెయిన్ పై పామ్ ఆయిల్ ఎఫెక్ట్ ఉంటుంది. పామ్ ఆయిల్ వల్ల గుండె జబ్బులు, చిన్న వయసులోనే డయాబెటిస్ కు గురవుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా కూడా ఇదే. దేశంలో పామ్ ఆయిల్ వినియోగం, నష్టాలపై కేంద్రానికి నివేదించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యంపై ఎటువంటి సమస్య, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ బాధ్యత వహించదు. గమనించగలరు.