కివి ఫ్రూట్ లో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సీ, విటమిన్ ఈ, విటమిన్ కే ,పొటాషియం, కాల్షియం, ఫైబర్,యాంటీ యాక్సిడెంట్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఇన్స్టాప్లమెంటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.కివి ఫ్రూట్ ఒకప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మాత్రమే అందుబాటులో ఉండేవి అయితే ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొంది సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయి. తీపి పుల్లని రుచితో అధిక పోషకాల గనిగా పిలవబడే కివి ఫ్రూట్ ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా అంటారు. ప్రతిరోజు అల్పాహారానికి ముందే కివి ఫ్రూట్ జ్యూస్ చేయిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు కివి పండ్ల రసాన్ని సేవిస్తూ ఇందులో ఉండే సహజ ఆక్సిడెంట్, విటమిన్ సి, విటమిన్ ఏ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. అలాగే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని, జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది. నారింజ బత్తాయి కంటే అధిక మొత్తంలో విటమిన్ సి లభ్యమవుతుంది. కావున హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమయ్యే ఐరన్ ను గ్రహించడంలో సహాయపడి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది.ఎర్రరక్త కణాలను అభివృద్ధి చేయడంలో సహాయపడి డెంగ్యూ ఫీవర్ ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది.
కివి ఫ్రూట్లో సమృద్ధిగా లభించే ఫైబర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి చక్కర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి శరీర బరువును నియంత్రిస్తుంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించి సీజనల్గా వచ్చే జలుబు దగ్గు ఆయాసం వంటి లక్షణాలను తరిమికొడుతుంది. ఇందులో సమృద్ధిగా లభ్యమయ్యే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎముకలు, కండరాలను దృఢంగా ఉంచి కీళ్ల నొప్పులు,ఆర్థరైటిస్ ఆస్థియోఫోరోసిస్ వంటి వ్యాధి లక్షణాలను మనలో నియంత్రిస్తుంది. మెగ్నీషియం మెదడు కండరాలను దృఢపరిచి జ్ఞాపకశక్తిని ,మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది.