సాధారణంగా మనం చేసే ప్రతి ఒక్క వంటలు సరైన రుచి రావడం కోసం కరివేపాకు ఉపయోగిస్తుంటారు అయితే రుచి కోసం మాత్రమే కరివేపాకును ఉపయోగిస్తున్నాము అంటే పొరపాటు పడినట్లే.కరివేపాకు ఆహారానికి రుచిని అందించడమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని తెలుసు.కానీ చాలామంది తినే ఆహార పదార్థాలలో కరివేపాకు కనుక వస్తే వెంటనే దానిని తీసి పక్కకు పడేస్తుంటారు. అది పొరపాటే. ఇలా మీరు కరివేపాకుని పడేస్తున్నారు అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా దూరం చేసుకున్నట్టేనని చెప్పవచ్చు.
ఎందుకంటే కరివేపాకులో మన శరీర పెరుగుదలకు అవసరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి,ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, మాంసకృత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అలాగే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ C, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ E ,యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ గుణాలు మనలో ఇమ్యూనిటీ శక్తిని పెంచి సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. కాబట్టి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కరివేపాకును ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
కరివేపాకులో సమృద్ధిగా ఉన్న విటమిన్ ఎ కంటి
సమస్యలను దూరంచేసి కంటిచూపును మెరుగు పరుస్తుంది. అలాగే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ ఈ
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది నీటిలో కరివేపాకును బాగా మరిగించి కాస్త నిమ్మరసం,చక్కెర కలిపి ‘టీ’ రూపంలో ప్రతిరోజు తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి అతి బరువు సమస్య నుంచి బయట పడవచ్చు. కరివేపాకులో ఉండే అరోమా నరాల్ని రిలాక్స్ చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది