పుచ్చకాయను గింజలతో పాటు జ్యూస్ తయారు చేసుకుని సేవిస్తే ఏమవుతుందో తెలుసా..?

మనలో చాలామంది అత్యధిక వాటర్ కంటెంట్ ఉన్న పుచ్చకాయలను వేసవి సీజన్లో డిహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవడానికి మాత్రమే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. అలా కాకుండా తరచూ పుచ్చకాయను మరియు పుచ్చకాయ జ్యూస్ ను తీసుకుంటే సకల ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చు. కొంతమంది శీతాకాలంలో పుచ్చకాయలను తింటే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయని అపోహ పడుతుంటారు. పుచ్చకాయలు సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఏ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం,మెగ్నీషియం అమినో ఆమ్లాలు సమృద్ధిగా లభ్యమవుతాయి కావున తరచు పుచ్చకాయ రసాన్ని సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.

పుచ్చకాయ జ్యూస్ లో తేనె కలుపుకొని సేవిస్తే శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ సమృద్ధిగా లభించి తక్షణ శక్తిని అందించడంతోపాటు నీరసం, అలసట వంటి లక్షణాలు తొలగిపోతాయి. పుచ్చకాయలో సమృద్ధిగా ఉన్న ఖనిజ లవణాలు జీవక్రియల లోపాలను తొలగించి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలు సమృద్ధిగా ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో చెడు మలినాలను తొలగించి ఉబకాయ సమస్యను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.

పుచ్చకాయలో సమృద్ధిగా ఉన్న మెగ్నీషియం, పొటాషియం మూలకాలు రక్త ప్రసరణ వ్యవస్థలోని అడ్డంకులను తొలగించి రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. మెగ్నీషియం నాడీ కణాల అభివృద్ధిలో సహాయపడి మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి, మానసిక ఒత్తిడిని తగ్గించి రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయను గింజల తో పాటు జ్యూస్ తయారు చేసుకొని సేవిస్తే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వ్యాధికారక మరియు క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో ఎంతగానో తోడ్పడతాయి, మరియు హై బీపీ సమస్యను కూడా అదుపులో ఉంచుతాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్లను తగ్గించి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.