మీ పిల్లలు బరువు పెరగాలా.. ఈ ఆహారాలు తింటే సులువుగా బరువు పెరుగుతారట!

పిల్లలు బరువు ఎక్కువగా ఉంటే ఎంత నష్టమో బరువు తక్కువగా ఉంటే కూడా అంతే నష్టం అనే సంగతి తెలిసిందే. పిల్లల శరీరతత్వాన్ని బట్టి వాళ్లకు ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా వాళ్లు సులువుగా బరువు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పిల్లలు బరువు పెరగడానికి ఇవ్వాల్సిన ఆహార పదార్థాలలో పాలు ఒకటి. నీళ్లు కలపకుండా ఫ్యాట్ మిల్క్ పిల్లలకు ఇస్తే సులువుగా బరువు పెరుగుతారు.

పిల్లలకు బాదం, జీడిపప్పు ఇవ్వడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. పిల్లలు తరచూ కూరగాయలతో కూడిన ఆహారం తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిలగడదుంపలు, బంగాళదుంపలలో కొవ్వు పదార్థాలు ఉండగా మొక్కజొన్న, బఠానీలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే అరటిపండ్ల వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

చికెన్ తినడం వల్ల కూడా పిల్లలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కేలరీలు ఎక్కువగా ఉండే చికెన్ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు. పిల్లలు కేలరీలు ఎక్కువగా ఉండే గుడ్లు తినడం వల్ల కూడా సులువుగా బరువు పెరుగుతారు. పెరుగు, పండ్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పిల్లలకు వేరుశనగలు ఇవ్వడం కూడా ఆరోగ్యానికి మంచిది. వేరుశనగలు ఉడికించి ఇవ్వడం ద్వారా పిల్లలకు మంచిది. వేరుశనగలు బెల్లంతో కలిపి తీసుకుంటే సులభంగా జీర్ణమవుతుంది. పిల్లలు బరువు పెరిగి బలంగా ఉండాలని భావించే తల్లీదండ్రులు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.