ఉదయాన్నే ‘పసుపు టీ..’ హాయ్.. హాయ్..! ఎంతో ఆరోగ్యమోయ్..!!

ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మనకు కాఫీ తాగాలి. కొందరు టీ కూడా తాగుతారు. శరీరం ఉత్తేజితం కావాలన్నా, మైండ్ రిలాక్స్ అనిపించాలన్నా ఇవి తప్పనిసరి. నిద్ర మత్తును కూడా వదిలించి మెదడు చురుగ్గా పని చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. అయితే.. నేటి అభిరుచులకు తగ్గట్టు వీటిల్లో అనేక ఫ్లేవర్లు వచ్చాయి. అందులో పసుపు టీ కూడా చేరింది. రుచికరంగా ఉండే ఈ పసుపు టీ ఉదయాన్నే ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది. టీలో పసుపు వేయడం కంటే.. డైరెక్టుగా పసుపు టీనే తాగితే మంచిది.

కప్పు కంటే కాస్త ఎక్కువ నీరు గిన్నెలో పోసి వేడి చెయ్యాలి. చిటికెడు పసుపు వేసి ఉడకనివ్వాలి. టీ పొడి వేసి చిన్నమంటపై కాసేపు మరగనివ్వాలి. తర్వాత నీటిని వడపోసి అందులో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం, తేనె చెంచాడు వేసి కలపాలి. అలా తయారయ్యేదే పసుపు టీ. పసుపు టీ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. తీక్షణంగా చూస్తారు. క్లియర్‌గా కనిపిస్తుంది.

పసుపు మన కంటిలోని రెటీనాను బాగుచేస్తుంది. పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. అది రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గేలా చేస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తంలో గడ్డలు కట్టి హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తుంది. దీనిని పసుపు అరికడుతుంది. పసుపు టీ వల్ల ఈ ఉపయోగం ఉంటుంది. పసుపులోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో కాన్సర్  కణాలు ఉంటే నాశనం చేస్తుంది. పెరగనివ్వదు కూడా. పసుపు టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవడం.. జ్ఞాపకశక్తి పెరగడం.. బరువు తగ్గడం.. చుండ్రు నివారణ, కీళ్లనొప్పుల సమస్య తీరతాయి.

ఎలా చూసినా పసుపు వల్ల ఉపయోగాలే. స్త్రీలు తమ ముఖానికి, కాళ్లకు కూడా పసుపు రాసుకునేది అందుకే. బాహ్య శరీరంపై ఉండే చెడు బ్యాక్టీరియాను అంతం చేస్తుంది. శరీరంలోకి ఇలా టీ ద్వారా పసుపు వెళ్తే శరీరంలో ఆరోగ్యం. కొందరు రాత్రిళ్లు పాలల్లో పసుపు వేసుకుని తాగుతారు. ఇది కూడా ఆరోగ్యమే. కాబట్టి.. పసుపు వల్ల ఆరోగ్యాన్ని ఉదయం పూట ఫ్రెష్ గా అందించాలంటే ‘పసుపు టీ’ ఎంతో శ్రేయస్కరం..!

గమనిక: ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యం కోసం ఎటువంటి సూచనలు అవసరమైనా.. ఆహార నిపుణులు, వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. గమనించగలరు.