Salad: సమ్మర్ లో బాడీ హీట్ ను తగ్గించే ‘సలాడ్స్’..! ఎన్ని రకాలుగా అంటే..

Salad: ఎండాకాలంలో వేడిని తట్టుకోవడానికి.. బాడీ డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండేందుకు మంచినీళ్లు ఎక్కువగా తాగుతాం. కూలింగ్ వాటర్, డ్రింక్స్, కొబ్బరినీళ్లు, తాటి ముంజలు, సుగంధి వాటర్.. ఇలా సమ్మర్ హీట్ నుంచి తట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే.. వీటన్నింటితోపాటు సమ్మర్ లో సలాడ్లు తీసుకుంటే కూడా బాడీ హీట్ తగ్గి చల్లదనం, చలవ చేస్తాయి. వీటిలో ఫ్రూట్ సలాడ్లు, కూరగాయల సలాడ్లు, మిక్స్‌డ్ సలాడ్లు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. సలాడ్లలోని ఫైబర్ మన శరీర బరువును కంట్రోల్ లో ఉంచుతుంది.

వేసవిలో మన శరీరంలో రక్తం, గ్లూకోజ్ సరిపడా ఉండాలి. నీరు తగినంతగా లేకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఫలితంగా.. కళ్లు తిరిగడం, వడదెబ్బ తగులడం, చర్మం ఎండిపోవడం, బ్రెయిన్పై ఎఫెక్ట్ వంటి సమస్యలొస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే సలాడ్లు తినాలి. వాటిలోని పోషకాలు మనకు ఎనర్జీ ఇస్తాయి. అలసటను దూరం చేస్తుంది. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండి సౌందర్యంగా కనిపిస్తుంది.
సలాడ్లు బాడీలోని వ్యర్థాలను బయటకు పంపేస్తాయి. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. దీంతో మనం రోజంతా యాక్టివ్ గా ఉంటాం. నేడు మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ చాలా ముఖ్యం వేపుళ్లు, ఫ్రైలు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఫైబర్ అందరు. జీర్ణక్రియ మందగించి మలబద్ధకం వస్తుంది. పొట్టలో పేగులకు నూనె పదార్థాలు అతుక్కుని అల్సర్, ఎసీడీటీ వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే సలాడ్లు తీసుకోవడం చాలా అవసరం. ఫైబర్ కడుపుని క్లీన్ చేసి చెడు కొవ్వును కరిగేలా చేస్తుంది.

ముఖ్యంగా సమ్మర్‌లో అరటి, మామిడి, ద్రాక్ష, జామ, దానిమ్మ, పుచ్చకాయ, కర్బూజ, యాపిల్, బొప్పాయి.. పండ్లతో సలాడ్స్ చేసుకుని తినాలి. వీటిలో బాదం పప్పు, వేరు శనగలు, మొలకలు, బఠాణీల వంటి వాటిని మిక్స్ చేసి మిక్సిడ్ సలాడ్ లా చేసి తింటే ఆరోగ్యం దక్కడమే కాదు శరీరానికి మందుల అవసరం పడదు. కూరగాయలతో అయితే.. టమాటా, ఉల్లి బఠాణీలు, కీర దోసకాయలు, మొలకలు వంటి వాటితో సలాడ్లు చేసుకొని తింటే ఉత్తమం. దీంతో రోజంతా సరిపోయే ఎనర్జీ వస్తుంది. చేసుకోవచ్చు. తద్వారా మరింత ఆరోగ్యం. మొక్కజొన్న, ఆవకాడో సలాడ్‌ జీర్ణక్రియను బాగా పెంచుతుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.