Tamarind seeds: చెడు బ్యాక్టీరియా అంతు చూసూ చింతపిక్కలు..! ఇంకా..

Tamarind seeds: పులుసు చేయాలంటే చింతపండు ఉండాల్సిందే. చింతపండు కేవలం కూరల్లో రుచి కోసమే అనుకుంటాం. కానీ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చింతపండు, చింతకాయలు, చింత చిగురు, చింతపిక్కలు.. ఇలా పలు రకాలుగా చింత మన ఆహారంలో భాగమవుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే చింతపండు నిండా ఔషధ గుణాలే ఎక్కువ. అనేక విటమిన్లు కూడా ఉంటాయి. అందుకు చింతచిగురు వచ్చే సీజన్లో దానిని వదిలిపెట్టరు కొందరు.

చిన్నపిల్లలు చింత చెట్టు నీడలో చింతకాయలు కొట్టి తింటారు. అలా కూరల్లోకే కాదు.. కాయలు కూడా మనకు మేలు చేసేదే. చింతపండు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని బి, సి, ఈ విటమిన్లు శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఇంకా ఇందులో ఉండే ఐరన్, పోటాషియం, కాల్షియం, పాస్పరస్, ఫైబర్, మాంగనీస్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. చింతపండు, చింత చిగురు, చింతకాయలే కాదు.. వాటిలోని పిక్కలు (చింతపిక్కలు) కూడా మనకు మేలు చేసేవే.

పైన పేర్కొన్న ఔషధ గుణాల్లో చింతపిక్కల్లోని కాల్షియం మన ఎముకల్ని మరింత బలోపేతం చేస్తాయి. కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. మహిళల్లో కాల్షియం లోపం వల్ల వచ్చే సమస్యలను తొలగిస్తాయి. మన శరీరంలోకి రకరకాల వ్యాధులు, వాతావరణంలోని మార్పుల వల్ల వచ్చే జ్వరాలతో రకరకాల బ్యాక్టీరియా చేరుతుంది. వీటికి విరుగుడుగా చింతపిక్కలు ఉపయోగపడతాయి. చింతపిక్కలు అధిక బరువును తగ్గిస్తాయి. ముఖ్యంగా గర్భిణిలకు చింతపిక్కల పొడి వాడితే వారికి మోకాళ్ల నొప్పులు ఉంటే తొలగుతాయి.

చింతపిక్కల్లో ఉండే టానిన్ చర్మంపై పేరుకుంటున్న బ్యాక్టీరియాను పారద్రోలుతుంది. వెన్నునొప్పి ఉన్నవారికి ఉపశమనం ఇస్తాయి. చింతపిక్కల పొడి రోజువారీ వాడకంతో శరీరంలో పేరుకుంటున్న కొవ్వు కరుగుతుంది. చింతపిక్కలను పొడిగానూ వాడొచ్చు.. లేదంటే వేపుకుని బఠానీల్లా వేపుకుని తినొచ్చు. ఇలా అనేక రకాల ఆరోగ్య కారకంగా ఉన్న చింతపిక్కలను తరచుగా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.