మనలో చాలామంది ఉసిరి తినడాన్ని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ఉసిరి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకురుతాయి. ఉసిరి రుచిగా ఉండటంతో పాటు మళ్లీ మళ్లీ తినాలని అనిపించేలా ఉంటుంది. ఆయుర్వేదంలో సైతం ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తారు. జుట్టు రాలే సమస్యతో బాధ పడేవాళ్లు ఉసిరి తీసుకోవడం ద్వారా ఆ సమస్యలను సులువుగా దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఉసిరికాయ పౌడర్ ను జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టు సంబంధిత సమస్యలు సులువుగా దూరమయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. చుండ్రుకు సులభంగా చెక్ పెట్టడంలో కూడా ఉసిరి తోడ్పడుతుంది. న్యుట్రియెంట్స్ పుష్కలంగా ఉండే ఉసిరి మృత కణాలకు చెక్ పెట్టడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. ఉసిరికాయల్లో విటమిన్ సి ఉండటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
ముఖం మీద ముడతలు రాకుండా చేసే విషయంలో ఉసిరి తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఉసిరి జ్యూస్ రోజూ తాగడం వల్ల స్కిన్ మరింత గ్లోగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. ఉసిరికాయలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ సులువుగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఉసిరిని పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది.
కాలేయ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు ఉసిరికి దూరంగా ఉంటే మంచిది. ఉసిరికాయలు తీసుకుంటే సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కిడ్నీ సంబంథిత సమస్యలతో బాధ పడేవాళ్లకు కూడా ఉసిరి ఏ మాత్రం మంచిది కాదు. ఈ సమస్యలతో బాధ పడేవాళ్లు ఉసిరికి దూరంగా ఉంటే మంచిది.