Health is Wealth: జామ.. ఆరోగ్య చిరునామా

జామ.. ఆరోగ్య చిరునామా (Health is Wealth): ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ కాలం లోనే తినాలంటారు పెద్దలు. ఈ చలికాలం సీజన్లో ఎక్కడ చూసినా విరివిగా కనిపించే కాయలు జామకాయలు. చౌకగా కనిపించే ఈ కాయలలో పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయి. మార్కెట్లో ఎక్కువకాలం లభించే కాయలలో జామకాయలు ఒకటి. అంతే కాకుండా ప్రతి ఇంటి పెరటి లో పెంచుకునే చెట్లలో జామకాయ చెట్లు ముందుస్థానంలో ఉంటాయి. ఈ జామకాయల ముక్కలపై మిరియాల పొడి, ఉప్పు వేసికొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తుంది.

ఆరోగ్యపరంగా.. చలికాలం లో లభించే జామకాయలు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతే కాకుండా బరువుని నిరోధించడంలో సాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా, నిగారింపుగా, యవ్వనంగా ఉండేటట్లు చేస్తుంది. ఈ పండ్లని తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. జామకాయలలో లభించే ఫైబర్ పదార్థం వలన అజీర్ణం లాంటి సమస్యలు తలెత్తడం తగ్గుతాయి. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.