మనలో చాలామంది మసాలాలు ఎక్కువగా ఉన్న వంటకాలను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మసాలాలు వంటకాలకు రంగు, రుచి, వాసనను కలిగిస్తాయని చెప్పవచ్చు. సాధారణంగా వంటకాలలో మిరపకాయలు, నల్ల మిరియాలు లాంటి మసాలాలను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది.
మసాలాలు ఎక్కువగా ఉన్న వంటకాలు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సుగంధ ద్రవ్యాల వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. మసాలాలు ఎక్కువగా ఉన్న వంటకాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. కడుపు ఉబ్బరం, నొప్పికి కూడా ఈ సమస్య కారణమవుతుంది.
మసాలాలు ఎక్కువగా తీసుకుంటే పొట్టలో పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. మసాలాల వల్ల వికారం, వాంతులు, తలనొప్పి, మలం, వాంతిలో రక్తం తీవ్రమైన గ్యాస్ట్రిటిస్ లక్షణాలు అని చెప్పవచ్చు. మసాలాలతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. సున్నితత్వం ఉన్నవారిలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మిరపకాయలు, మిరియాలు వంటి మసాలాలు బరువు తగ్గడంలో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. మిరపకాయలో క్యాప్సైసిన్, పెప్పర్‌లో పైపెరిన్ ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటి వల్ల కొవ్వులు తగ్గుతాయని చెప్పవచ్చు. మసాలా ఆహారంలో ఉండే క్యాప్సైసిన్ కొవ్వును కరిగించి మీ జీవక్రియను పెంచడంలో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పోషకాహార ప్రణాళిక, లక్ష్య వ్యాయామం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.