మీ మొబైల్ ఫోన్ లో ఉన్న ఈ యాప్స్ తొలగించకపోతే భారీగా నష్టపోక తప్పదు..?

ప్రస్తుత కాలంలో దేశంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీ అనేక మంచి పనులకు ఉపయోగపడుతుంటే, అదేవిధంగా ఈ టెక్నాలజీ వల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో రోజురోజుకీ సైబర్ నేరాలు సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ లోని కొన్ని ఆప్స్ వల్ల అనేక నేరాలు జరుగుతున్నాయి. ఇలా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయాలి. లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది.

మీ మొబైల్ ఫోన్ లో ఉండే కొన్ని యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేసి, మీ బ్యాంక్ ఖాతాలను కూడా యాక్సెస్ చేస్తాయి. దాంతో సైబర్ నేరగాళ్లు నీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తున్నారు. మొన్నటివరకు ఏదొక లింక్స్ ద్వారా టార్గెట్ చేస్తూ వచ్చారు.. కానీ ఇప్పుడు ఏకంగా యాప్ లనే టార్గెట్ చేశారు. ఆ యాప్లను థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించాయి. 203 ప్రమాదకరమైన యాప్స్‌ను గుర్తించిన ఈ సంస్థలు వీటిని తొలగించాలంటూ గూగుల్, యాపిల్‌ను కోరాయి. ఇటువంటి యప్స్ వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దొంగిలించి మరి వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు.

కొన్ని రకాల మోసపూరిత ఆప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయినట్లు కొన్ని రకాల సూచనలు కనిపిస్తాయి. ఒకవేళ మీ డివైజ్‌లో ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే ఉంటే మీ మొబైల్ బ్యాటరీ డ్రెయిన్ లేదా మొబైల్ పనితీరు మందగించడం మనం గమనించవచ్చు. అందువల్ల స్మార్ట్‌ఫోన్ పనితీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలిట్ చేయాలి, లేదంటే డేటాను బ్యాకప్ చేసి ఫోన్ ను రీసెట్ చెయ్యాలి. అలాంటివి చెయ్యడం వల్ల అకౌంట్ డీటైల్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉండదు.