ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్లు చేతిలో కనిపిస్తూనే ఉంటాయి. ఇలా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వ్యక్తిగత డేటాను మొత్తం స్మార్ట్ ఫోన్లో భద్రపరుచుకొని ఉంటారు అయితే ఈ స్మార్ట్ పొరపాటున ఎవరైనా దొంగలించినప్పుడు మన డేటా ఇతరులకు తెలియకుండా ఉండడం కోసం మనం మొబైల్ ఫోన్ లాక్ చేసి పెడతాము. ఇలా మొబైల్ లాక్ చేయడానికి ఎన్నో పద్ధతిలో ఉన్నాయి పాస్వర్డ్ పెట్టుకోవడం ఫింగర్ ప్రింట్ పెట్టుకోవడం, ఫేస్ స్కాన్ వంటి వివిధ రకాలుగా మనం ఫోన్ లాక్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మన ఫోన్ లాక్ మర్చిపోతూ ఉంటాము.
ఇలా మనం పెట్టిన పాస్వర్డ్ లేదా పాట్రన్ మర్చిపోయినప్పుడు మన ఫోన్ ఓపెన్ కాక ఎంతో ఇబ్బంది పెడతాము ఈ క్రమంలోనే మన ఫోన్ ఏకంగా సర్వీస్ సెంటర్ దగ్గరికి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే ఇకపై ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో కూర్చుని మన మొబైల్ ఫోన్ అన్లాక్ బ్రేక్ చేయవచ్చు. మరి మన మొబైల్ ఫోన్ పాటర్న్ ఎలా బ్రేక్ చేయాలి అనే విషయానికి వస్తే..
Google ఖాతా నుంచి పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం సులభమైన మార్గాలలో ఒకటి.మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా మిస్ కాకుండా చాలా సులభంగా మీ ఫోన్ ఓపెన్ కావాలంటే ముందుగా మనం పాస్వర్డ్ తరచూ ఏదో ఒకటి ఎంటర్ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మనకు మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనే మెసేజ్ వస్తుంది. మర్చిపోయిన పాస్వర్డ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇది ఓపెన్ చేయగానే మీరు మెయిల్ ఐడి , పాస్వర్డ్ నమోదు చేయమని అడుగుతుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ లో ఉపయోగించే మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెట్ న్యూపాస్వర్డ్ అనే బటన్ పై క్లిక్ చేసి కొత్త పాస్వర్డ్ ఎంపిక చేసుకొని తద్వారా మన ఫోన్ ఓపెన్ చేసుకోవచ్చు.