సాధారణంగా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ స్మార్ట్ ఫోన్లో చార్జింగ్ ఉందా లేదా డేటా ఉందా లేదా అనే విషయాలను మాత్రమే చూసుకుంటాం తప్ప మిగతా విషయాల గురించి నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం పట్టించుకోము. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని మనకు మెసేజ్ వచ్చినా కానీ చాలా మంది నెగ్లెట్ చేస్తూ ఉంటారు.అయితే ఇలా సాఫ్ట్వేర్ అప్డేట్ కనుక చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అని మరికొందరు కూడా అనుకుంటూ ఉంటారు. మరి మన మొబైల్ ఫోన్లో సాఫ్ట్వేర్ కనుక అప్డేట్ చేయకపోతే ఏం జరుగుతుంది ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయి అనే విషయానికి వస్తే..
ఇలా మనం ఒక యాప్ అప్డేట్ కనుక చేసుకోకపోతే ఆ యాప్ కు సంబంధించిన కొత్త ఫీచర్స్ అన్ని కూడా మనం కోల్పోతాము.అందుకే అప్డేట్ యువర్ యాప్ అని అడిగినప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడం వల్ల సరికొత్త ఫీచర్స్ ని వినియోగించే అవకాశం కలుగుతుంది. కొత్త ఫీచర్లు అందుకోవాలీ అంటే మనకొచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను చేయాల్సిందే. ఇక మొబైల్ కంపెనీ వాళ్ళు మన మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయమని చెబుతూ ఉంటారు అయితే ఇలా మనం చేయని పక్షంలో కొన్నిసార్లు మన ఫోన్ వేగం కూడా తగ్గిపోయి తరచూ స్ట్రక్ అవుతూ ఉంటుంది.
మొబైల్ కంపెనీలు విడుదల చేసే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో కెమెరా పనితీరును మరింత మెరుగుపరచటంతో పాటు బ్యాటరీ లైఫ్‌నూ పెంచే అప్‌డేట్స్ ఉంటాయి. సెక్యూరిటీ అప్‌డేట్ అనేది మన ఫోన్‌పై జరిగే హానికరమైన దాడుల నుంచి రక్షణ కల్పించడానికి సాయపడుతుంది. మన ఫోన్లలో ఉండే బగ్స్ కారణంగా ఒక్కోసారి సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఇలా సైబర్ దాడులు కూడా జరగకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనం మన మొబైల్ ఫోన్ అప్డేట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం.