Gallery

Home Health & Fitness Neem Tea: 'వేపాకు' టీ దివ్యౌషధమే..! తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

Neem Tea: ‘వేపాకు’ టీ దివ్యౌషధమే..! తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

Neem Tea: రోజువారీ పనుల్లో నిమగ్నమైనప్పుడు టీ బూస్టప్ ఇస్తుంది. సమయానికి టీ పడకపోతే.. నిస్సత్తువ ఆవరించేస్తుంది. అందుకే పనివేళల్లో టిఫిన్ కు భోజనానికి మధ్య.. సాయంత్రం వేళ టీ పడాల్సిందే. అప్పుడే చేసే పనిలో చురుకుదనం, మానసికోల్లాసం వస్తాయి.. ఒత్తిడి తగ్గిపోతుంది.. ప్రశాంతంగా మన పని జరిగిపోతుంది. అయితే.. టీ అలవాటు లేనివారూ ఉంటారు. వారికెటువంటి సమస్యా ఉండదు.. కారణం టీ అలవాటు లేకపోవడమే. అయితే.. ఇలా టీ తాగేవారు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ కొత్త కొత్త ఫ్లేవర్లలో టీ తాగుతున్నారు. అటువంటి కోవలోకి వచ్చే టీ ‘నీమ్ టీ’.

Dsc 0196 | Telugu Rajyam

వేపాకు టీ..! వేపాకే చేదు. ఇక వేపాకు టీ అంటే ఎలా ఉంటుందో అనే సందేహం రాకమానదు. కానీ.. ఇది హెర్బల్ టీ. వేపాకును ఔషధ గనిగా చెప్తూంటారు. రకరకాల అనారోగ్య సమస్యలను వేపాకు దివ్య  ఔషధం. ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా వాడుతూంటారు. వేపాకు మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌పై చక్కగా పోరాడుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఇదే క్రమంలో వేపాకు టీ తాగితే నోటి దుర్వాసన పోతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక కప్పు వేప టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవి.

వేపాకులో ఉన్న అద్భుతమైన ఔషధ గుణం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. చుండ్రు సమస్యను తొలగిస్తుంది. ఇందుకు కొన్న వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. దాన్ని చల్లారనివ్వాలి. షాంపుతో తలస్నానం చేసాక.. మరిగించి చల్లార్చిన వేపాకు నీటితో మరోసారి శుభ్రం చేసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇలాంటి ఔషధ గుణాలు నీమ్ టీ సొంతం. అయితే.. నీమ్ టీని గర్భిణిలు తాగొద్దు. డాక్టర్ల సలహా తీసుకోవడం ఉత్తమం. బాలింతలు కూడా వేపాకు టీ తాగకూడదు. వీరితోపాటు.. అవయవ మార్పిడి చేసుకున్నవారు.. కొన్ని రోజుల క్రితమే శస్త్రచికిత్స చేయించుకున్నవారు వేపాకు టీ తాగకుండా ఉండాలి.

వేపాకు టీని.. రెండు కప్పుల నీటిలో 6-10 వేపాకులు వేసి మరిగించాలి. చేదు పోగొట్టుందుకు అందులో బెల్లం లేదా పంచదార వేసి కలపాలి. మరుగుతున్న నీళ్లు లైట్ గ్రీన్ కలర్‌లోకి వచ్చాక దించేసి.. వేడి వేడి నీమ్ టీ తాగేయడమే.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆరోగ్య నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆరోగ్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

- Advertisement -

Related Posts

చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్…సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి!

దేశంలో ఇప్పటికే కరోనా మహమ్మారి రెండు సార్లు దాడి చేసి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ ఎక్కువ ప్రభావంగా ఎటాక్ చేసి మరింత మందిని బలి చేసుకుంది....

మనం నిత్యం వాడే ‘వీటి’ వల్ల కలిగే ఉపయోగాలు !

ఆరోగ్యమే మహాభాగ్యం...ఏం ఉన్నా లేకపోయినా, జీవితానికి అదొక్కటి ఉంటే చాలు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్థాల గురించి తెలుసుకోవటం అవసరం. నిత్యం మనం ఉపయోగించే వాటిలో కొన్నింటి వల్ల కలిగే మేలు గురించి తెలుసుకుందాం. పసుపు: రక్త శుద్ధి...

స్పూన్ నూనెతో ఆరోగ్యం… సింపుల్ గా ఇలా చేయండి !

ఇప్పుడున్న జీవన గమనంలో ప్రతిరోజు మనం కలుషిత గాలిని లోపలకి పీలుస్తున్నాం. అలానే ప్యాకేజ్డ్, ఫ్రైడ్, ఫాస్ట్, ప్రొసెస్డ్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇలాంటి ఫుడ్ ని మన శరీరం అరగించుకోటానికి...

Latest News