Gallery

Home Health & Fitness Green Food: వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో 'గ్రీన్ ఫుడ్' పాత్ర.. చాలా..!!

Green Food: వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ‘గ్రీన్ ఫుడ్’ పాత్ర.. చాలా..!!

Green Food: తాజా ఆహారం ఎప్పుడూ మంచి ఆరోగ్యాన్నిస్తుంది. అనారోగ్యాన్ని దూరం చేసి.. పోషకాలు ఎక్కువగా ఉండి ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో గ్రీన్ ఫుడ్ ఒకటి. గ్రీన్ ఫుడ్స్ లో పాలకూర, కొత్తిమీర, పుదీన, బచ్చలి కూర, క్యాబేజీ, ఆవకాడో, బ్రకోలీ, నిమ్మకాయ, ద్రాక్ష, కరివేపాకు, గ్రీన్ టీ.. ఇవన్నీ గ్రీన్ ఫుడ్ లో భాగమే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలే మనకు బలం. అప్పటికే బాడీలో వ్యర్థాలు వుంటే తరిమేస్తాయి.. వైరస్‌, బ్యాక్టీరియాను తరిమేస్తాయి. గ్రీన్ ఫుడ్స్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

K2 848Ef0F6 04B8 497E 81F8 627C17068316.V1 1 | Telugu Rajyam

కీర దోసకాయల్లో నీరు ఎక్కువ. కళ్లకు మంచిది. ఎండాకాలంలో ఎక్కువగా తినాలి. వీటిలో విటమిన్ A, C, B12, B6, D, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. విటమిన్ C ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయం జ్యూస్ తాగే అలవాటు ఉంటే అందులో కీర దోసకాయ ముక్కలు ఉంటే మంచిది. గ్రీన్ ఫుడ్ తినడం వల్ల మైండ్‌ ఫ్రెష్ గా ఉంటుంది.

బచ్చలి ఆకులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫొలేట్, విటమిన్ K, A, C ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇన్ని పోషకాలు మన జీర్ణవ్యవస్థను రక్షిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేడిని తగ్గిస్తాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి. క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల్ని ధృడంగా మారుస్తుంది. ప్రధానంగా కంటికి మేలు చేస్తాయి.

గ్రీన్ యాపిల్స్ నే తీసుకుంటే ఎక్కువ జ్యూస్‌తో ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, ఫైబర్, విటమిన్ A, C, B, E ఉంటాయి. ఇవన్నీ మన చర్మం మెరిసేలా చేస్తాయి. గ్రీన్ యాపిల్‌ని తొక్కతో సహా తింటే మరింత మంచిది. బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. బీపీని కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

గ్రీన్‌ ఫుడ్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేస్తాయి. బాడీ మెటబాలిజంను పెంపొందిస్తుంది. ఇందులోని క్లోరోఫిల్ రక్త కణాల్ని అభివృద్ది చేస్తుంది.. రక్త ప్రసరన సవ్యంగా జరిగేలా చేస్తుంది. ఆక్సిజన్‌ను పెంచుతుంది. శరీరానికి అవసరమైన పోషకాల్ని అందిస్తాయి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

- Advertisement -

Related Posts

Yoga Day 2021: నేడే ‘యోగా డే’..! ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలు

Yoga Day 2021: ‘యోగా’ను రోజువారీ దినచర్యగా భావిస్తున్నారు ప్రజలు. ప్రపంచం మొత్తం యోగా వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తించింది. దేశాలు, భాషలు, సంస్కృతులు వేరైనా.. యోగా మాత్రం అందరినీ ఒక్కటి  చేసింది....

Yoga: వారానికో గంటైనా ‘యోగా’ చేస్తే.. ఈ రుగ్మతల నుంచి బయటపడొచ్చు..!!

Yoga: పురాతనమైన యోగాపై కొన్నేళ్ల క్రితమే అవగాహన పెరిగింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన యోగా మళ్లీ పుంజుకుంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం యోగా.. అని ప్రజలు విశ్వసించడమే ఇందుకు కారణం. దీంతో...

Coffee & Tea: ఉదయాన్నే.. ఖాళీ కడుపుతో కాఫీ, టీ మానేయాలట..! ఎందుకంటే..

Coffee & Tea: బెడ్ కాఫీ ఎంతోమందకి అలవాటు. కొందరు టీ తాగుతారు. ఎక్కువమందికి ఉదయం లేవగానే ఈ బెడ్ కాఫీ లేదా టీ తాగనిదే ఏ పనీ చేయలేరు. అసలు వారికి...

Latest News