Ashwagandha Tea: గొంతు సమస్యలా..? అశ్వగంధ-జేతిమధ్ టీ ట్రై చేయండి..!!

Ashwagandha Tea: ఉదయం నిద్ర లేవగానే టీ తాగకపోతే కొందరికి మనసు ఊరుకోదు. పని వేళల్లో టీ తాగకపోతే చేసే పనిపై శ్రద్ధ చూపలేం. మహిళలైనా టీ ఓ సిప్ చేయకపోతే.. వంట పనిలో చురుకుదనం చూపలేరు. సాయంత్రం వేళ అలా ఓ టీ పడకపోతే.. రాత్రి భోజనం వరకూ మనశ్శాంతి ఉండదు. ఇలా టీ తో మనకు ఉల్లాసం వస్తుంది. ఇదే టీ ఇప్పుడు ఎన్నో ఫ్లేవర్లలో అందుబాటులో ఉంది. ఒక్కో టీ ఒక్కో సుగుణాన్ని కలిగి ఉంది. ఇందులో ‘అశ్వగంధ టీ’ ఒకటి. దీనితో ఎన్ని లాభాలున్నాయో చూద్దాం.

 

అశ్వగంధ-జేతిమథ్ టీ ఏంటి? టేస్ట్ ఎలా ఉంటుంది? ఈ టీ తాగడం వల్ల కలిగే లాభాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే విషయాలు సందేహాలైతే.. ఆయుర్వేద నిపుణులు ఈ ప్రశ్నలన్నింటికీ మంచి సమాధానమే కాదు.. ఈ టీ వల్ల ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. దగ్గు, జలుబు, తలనొప్పి, గొంతు మంట, ఊపిరాడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బుందులను తగ్గించడం.. శరీరంలోని చెడు బ్యాక్టీరియా తొలగించడం చేస్తుందని అంటున్నారు.

అశ్వగంధ-జేతిమధ్ కాడలు, పొడిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కాల్షియం, ఫ్యాట్, ప్రొటీన్, గ్లిసరిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బయోటెక్స్ ఉంటాయి. అందువల్ల ఈ టీ మంచి ఔషధంలా పని చేస్తుందని అంటున్నారు. రోజుకు రెండు మూడుసార్లు ఈ టీ తాగితే మంచి రిలీఫ్ వస్తుందని అంటున్నారు. గొంతు సమస్యలకు చక్కగ పని చేస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా జేతిమథ్ మన గొంతులో గరగర ఉంటే పోగొడుతుంది. గొంతు బొంగురు పోయినా సరి చేస్తుంది. మాట్లాడటంలో గొంతు సమస్యను సరి చేస్తుంది. శ్వాస సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు, బైల్ వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంలా పని చేస్తుంది. వంటింటి సరుకుల్లో ఈ టీ పొడిని కూడా భాగం చేసుకోవాలంటున్నారు.

ఈ టీ తయారు చేసుకునే క్రమంలో ముందుగా ఓ అంగుళం పొడవున్న అశ్వగంధ ముక్కను ఓ గ్లాస్ నీటిలో ఉడికించండి. ఉడుకుతున్న నీటినే మరో గ్లాసులో పోయండి. ఈ నీటిలో ఓ టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం వేసుకోవాలి. అదే.. అశ్వగంధ టీ. అన్ని వయసుల వారికీ ఈ టీ మంచిది. ప్యాకెట్ల రూపంలో సూపర్ బజార్లలో, ఆయుర్వేదం స్టోర్లలో కూడా ఇప్పుడు అశ్వగంధ లభ్యమవుతోంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.