జుట్టు రాలుతూ.. కళ్ళు మసకబారుతున్నాయా మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లే?

జుట్టు ఆడవారికైనా మగవారికైనా ఎంతో అందాన్ని ఇస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో మనం తీసుకుంటున్న ఆహారం వల్ల అధిక సంఖ్యలో పోషకాలు లోపించడం వల్ల జుట్టు రాలే సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ విధంగా మన జుట్టుకు అవసరమైన పోషకాలు సరైన స్థాయిలో అందకపోతే జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లతో పాటు క్యాల్షియం జింక్ కూడా ఎంతో అవసరం. ఈ విధంగా ఎప్పుడైతే మన శరీరంలో జింక్ లోపం అధికంగా ఉంటుందో ఆ సమయంలో జుట్టు రాలే సమస్య అధికమవుతుంది.

జుట్టు పెరుగుదలకు మాత్రమే కాకుండా మన శరీరంలో అన్ని ప్రక్రియలు సక్రమంగా జరగడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కంటిచూపు విషయంలో కూడా జింక్ ఎంతగానో దోహదపడుతుంది.మన శరీరానికి సరైన స్థాయిలో జింక్ అందకపోతే కంటి చూపు మందగించడమే కాకుండా కళ్ళు మసకబారినట్టు కనపడతాయి. ఈ విధంగా ఎప్పుడైతే అధికంగా జుట్టు ఊడిపోతుందో ఆ సమయంలో మీరు జింక్ లోపంతో బాధపడుతున్నట్లు అర్థం.

ఈ విధంగా జింకు లోపంతో బాధపడేవారు సరైన పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడమే కాకుండా జింక్ సప్లిమెంటరీ రూపంలో కూడా తీసుకోవాలి. ముఖ్యంగా జింక్ పుష్కలంగా లభించే పచ్చి శనగలు, పప్పు ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్‌ చాక్‌లెట్లు, పాలకూర, పుట్టగొడుగులు, గుడ్డువంటి మొదలైన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి తగిన మోతాదులో జింక్ లభ్యమవుతుంది.