సాధారణంగా ప్రతి రోజూ మనం వంటలు తయారు చేయడానికి కూరగాయలు ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా ఉపయోగించే కూరగాయలలో టమాట తప్పనిసరిగా ప్రతి వంటలో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రజలు తమ రోజువారి ఆహారంలో టమాట తప్పనిసరిగా ఉంటుంది. సాధారణంగా బాగా పండిన టమాటాలను వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పప్పు, చారు వంటి అనేక రకాల వంటలలో ఈ ఎరుపు రంగు టమాటాలను ఉపయోగించడమే కాకుండా ఈ బాగా పండిన టమాటాలతో టమాటా కెచప్, టమాట పచ్చడి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇలా బాగా పండిన టమోటాల వల్ల రుచికరమైన ఆహార పదార్థాలలో తయారు చేసుకోవచ్చు
అయితే పచ్చి టమాటాలు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వాటిలో ఉన్న పోషకాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. పచ్చి టమాటా లలో ఉండే పోషకాలు వాటిని తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పచ్చి టమాటాలలో విటమిన్ సి, విటమిన్ ఏ పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాగా పండిన టమాటాల కన్నా పచ్చి టమాటాలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పచ్చి టమాటాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్ సి అందించి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
ముఖ్యంగా ఈ శీతాకాలంలో శరీరానికి విటమిన్ సి అవసరం చాలా ఉంది. విటమిన్ సి శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి శరీరం రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చి టమాటాలను మనం తీసుకునే ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా పచ్చి టమాటాలలో బీటా కెరటిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కంటి చూపుకి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే ఇవి తినటం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్తపోటు సమస్యలు కూడా నియంత్రిస్తుంది. అందువల్ల ప్రతిరోజు మనం తీసుకొని ఆహారంలో పచ్చి టమాటాలను తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త వహించాలి.