రక్తహీనత సమస్యను పెంచే గ్రీన్ టీ…ఎందుకో తెలుసా?

side effects of green tea

గ్రీన్ టీ ని తగిన మోతాదులో సేవిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. గ్రీన్ టీ నీ రోజుకు రెండు లేదా మూడు కప్పులు సేవిస్తే ఇందులో పుష్కలంగా ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ ఆల్కలాయిడ్, ఫ్లేవనాయిడ్లు,ఫైటోకెమికల్స్ మనలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గ్రీన్ టీ లో క్యాలరీలు ఉండవు సహజ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు మలినాలను తొలగించి శరీర బరువును నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడతాయి. ప్రతిరోజు గ్రీన్ టీ తాగే వారిలో నాడీ కణ వ్యవస్థ దృఢంగా ఉండి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దాంతో ఒత్తిడి ,నీరసం వంటి సమస్యలు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది. జీర్ణ వ్యవస్థ గుండె ఆరోగ్యం, రక్తపోటు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు నియంత్రణలోంచే శక్తి గ్రీన్ టీలో పుష్కలంగా ఉంది

ప్రతిరోజు 6 నుంచి 8 కప్పుల గ్రీన్ టీ తాగే వారిలో అనేక దుష్ప్రభావాలు ఉంటాయని అనేక సర్వేల్లో వెల్లడింది. గ్రీన్ టీ ని ఎక్కువగా సేవిస్తే మన శరీరంలో ఐరన్ మూలకాన్ని గ్రహించే శక్తి లోపించి ప్రమాదకరం రక్తహీనత సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కండరాల నొప్పులు, కళ్ళు తిరగడం, మానసిక ఒత్తిడి, అలసట వంటి సమస్యలు మనల్ని బాధిస్తాయి. గ్రీన్ టీ లో సహజంగా లభించే కెఫిన్ పరిమితంగా తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. గ్రీన్ టీ ఎక్కువ తాగడం వల్ల కెఫిన్ ఆల్కలాయిడ్ మోతాదు అధికమై
మెలటోనిన్ హార్మోన్‌ ఉత్పత్తి పై ప్రభావం చూపి నిద్రలేమి సమస్యలు, హై బీపీ, మానసిక రుగ్మతలు తలెత్తవచ్చు.

గ్రీన్ టీ ని ఆరు కప్పుల నుంచి సేవిస్తూ మన శరీరంలో క్యాల్షియం విలువలు నశించిపోయి రుమటాయిడ్ , ఆర్థరైటిస్, ఆస్తియో ఫోరోసిస్ వంటి సమస్యలు తలెత్తి చిన్న వయసులోనే ఎముకలు బలహీనంగా మారే ప్రమాదం ఉంది. గ్రీన్ టీ లో టానిన్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ టీ తీసుకుంటే తలనొప్పి సమస్య తగ్గుతుంది.ఎక్కువగా గ్రీన్ టీని తీసుకుంటే మైగ్రేన్ సమస్యకు దారి తీయవచ్చు. గ్రీన్ టీ లో టానిన్ మూలకం ఎక్కువగా ఉంటుంది. ఈ మూలకం ఎక్కువైతే జీర్ణ క్రియ రేటు తగ్గి కడుపులో మంట, మలబద్ధకం, గ్యాస్టిక్ వంటి సమస్యలు తలెత్తుతాయి ఒక్కొక్కసారి వాంతులు, విరేచనాలకు కూడా దారి తీయవచ్చు.