గ్రీన్ టీ ఎక్కువగా తాగే మహిళలకు షాకింగ్ న్యూస్.. టీ తాగితే పిల్లలు పుట్టరంటూ?

మహిళలలో చాలామంది గ్రీన్ టీ తాగడానికి ఎంతో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. గ్రీన్ టీ వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో నష్టాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే చాలామంది గోరువెచ్చని గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడతారు. గ్రీన్ టీ తాగేవాళ్లు ఈ టీ వల్ల కలిగే దుష్ప్రయోజనాలను కూడా తెలుసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.

శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో గ్రీన్ టీలో ఉండే ఒక పదార్థం వల్ల సంతానోపత్తికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయని తేలింది. గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు సైతం రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు గ్రీన్ టీ తీసుకుంటే ఎలాంటి సమస్య లేదని అంతకు మించి గ్రీన్ టీ తీసుకుంటే మాత్రం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్టేనని వైద్యులు చెబుతున్నారు. ఎలుకలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి ఈ విషయాలను వెల్లడించడం జరిగింది.

గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి క్యాలరీలు లభించే అవకాశం ఉండదు. గ్రీన్ టీలో చక్కెరను ఉపయోగించే వారు చక్కెరకు బదులుగా తేనెను కలిపి తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. గ్రీన్ టీ తాగడం వల్ల కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఏవైనా మందులను వాడే సమయంలో గ్రీన్ టీ తాగడం మంచిది కాదని చెప్పవచ్చు.

గ్రీన్ టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ ఎక్కువగా ఉన్న గ్రీన్ టీ తాగడం వల్ల నార్మల్ బాడీ ఫంక్షన్స్ పనిచేయడం కష్టం కావడంతో పాటు గ్రీన్ టీలో టానిన్ పొట్టలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేసి జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. ఎవరైతే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటారో వాళ్ల ఐరన్ రక్తంలో పోషణ చెందదు. ఇందులో ఉండే టానిన్ వల్ల రక్తంలో ఉన్న న్యూట్రిషియన్స్ సామర్థ్యం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.

గర్భవతులు కెఫిన్ పానీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సైతం వెల్లడిస్తున్నారు. పొట్టలో ఉండే శిశువుపై గ్రీన్ టీ ప్రభావం చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది. గ్రీన్ టీ తాగేవాళ్లు గ్రీన్ టీ వల్ల కలిగే నెగిటివిటీని కూడా గుర్తుంచుకుంటే అరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.