మనలో చాలామంది పచ్చిమిర్చితో చేసిన వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. పచ్చిమిర్చి రేటు మండుతున్నా కొన్ని వంటకాలలో పచ్చిమిర్చిని మాత్రమే వాడగలమని చెప్పవచ్చు. పచ్చిమిర్చికి ప్రత్యామ్నయం ఉండదనే సంగతి తెలిసిందే. టమాటాలను సబ్సిడీపై ఇస్తున్న ప్రభుత్వం పచ్చిమిర్చిని మాత్రం సబ్సిడీలో ఇవ్వడానికి సైతం ఇష్టపడటం లేదు. పచ్చిమిర్చితో చేసిన వంటకాలు రుచికరంగా ఉంటాయి.
అయితే పచ్చిమిర్చితో చేసిన వంటకాలను మరీ ఎక్కువగా వాడటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఎక్కువగా అవకాశం ఉంటుంది. పచ్చి మిరపకాయలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎక్కువమొత్తంలో పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల అల్సర్ సమస్య వేధించే అవకాశం అయితే ఉంటుంది. కొన్నిసార్లు పచ్చిమిర్చి వల్ల కడుపులో వాపు వచ్చే ఛాన్స్ ఉంది.
పచ్చి మిరపకాయలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్య వేధించే అవకాశం అయితే ఉంటుంది. పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవడం వల్ల డిమెన్షియా సమస్య వేధించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. పచ్చిమిర్చిని మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. పచ్చిమిర్చిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
పచ్చిమిర్చి అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుని వంటకాలను చేసుకుంటే మంచిది. పచ్చిమిర్చి పరిమితంగా తింటే కొన్ని లాభాలు ఉన్నాయి. కంటిచూపును మెరుగుపరచడంలో పచ్చిమిర్చి ఎంతగానో సహాయపడుతుంది. పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది.