గుడ్ న్యూస్ ఓమిక్రాన్ బి.ఎఫ్. 7 వేరియంట్ ప్రభావం ఇండియన్స్ పై ఉండదట…. ఎందుకంటే?

కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ప్రభావానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని భావించిన నేపథ్యంలోనే మరోసారి ఓమిక్రాన్ బి.ఎఫ్. 7 వేరియంట్ తన పంజా విసురుతుంది.ఇప్పటికే చైనాలో అత్యధికంగా కేసులు నమోదవడంతో అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు.అయితే ఈ వేరియంట్ వివిధ దేశాలలో వ్యాప్తి చెందటం వల్ల మన దేశంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యి ఎయిర్ పోర్టులలో పలు ఆంక్షలు విధించారు.

ఇకపోతే వైద్య అధికారులు ఓమిక్రాన్ బి.ఎఫ్. 7 వేరియంట్ విషయంలో భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఈ వేరియంట్ ఇతర దేశాల వారిపై చూపినంత ప్రభావం ఇండియాలో చూపించలేదని ఇండియాలో కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయని నిపుణులు తెలియజేశారు.అయితే ఈ వేరియంట్ ప్రభావం చూపక పోవడానికి గల కారణం ఇక్కడ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ రెండు డోస్ లతో పాటు బూస్టర్ డోస్ తీసుకోవడమే కారణం అని తెలుస్తుంది.

ఇలా ఇండియాలో ఓమిక్రాన్ బి.ఎఫ్. 7 వేరియంట్ ప్రభావం పెద్దగా చూపకపోవడం అనేది నిజంగానే శుభవార్త అని చెప్పాలి. అయితే ఈ వేరియంట్ మనపై ఎలాంటి తీవ్రత చూపించదని మనం నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా మన దేశంలో కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందుకే పలు నిబంధనలను పాటించడం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.