మనలో చాలామంది గోండ్ కటిరా గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. గోండ్ కటిరా తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తెలుగులో గోండ్ కటిరాను గోధుమ బంక అని పిలుస్తారు. జిగురులా ఉండే గోండ్ కటిరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. బరువును అదుపులో ఉంచుకోవాలని భావించే వాళ్లు గోండ్ కటిరాను తీసుకుంటే మంచిది. మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఇది తోడ్పడుతుంది.
గోండ్ కటిరాలో శరీరానికి అవసరమైన పీచు కూడా లభిస్తుంది. చర్మం పగుళ్ల సమస్యలకు చెక్ పెట్టడంలో గోధుమ బంక ఉపయోగపడుతుంది. యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్న గోండ్ కటిరా చర్మం పగుళ్లు, గాయాలను నయం చేయడంలో తోడ్పడుతుంది. మొటిమలు, స్కిన్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో గోండ్ కటిరా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
గోండ్ కటిరా తీసుకోవడం ద్వారా ఎముకలలో దృఢత్వం పెరుగుతుంది. గోండ్ కటీరాలో కాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. గోండ్ కటీరా పేగు కదలికలను ప్రేరేపించి మలబద్ధకం సమస్యలకు చెక్ పెడుతుంది. గోండ్ కటిరా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విషయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
వైరస్, బ్యాక్టీరియాలతో శరీరం పోరాడేందుకు శక్తిని ఇచ్చే విషయంలో గోండ్ కటిరా తోడ్పడుతుంది. శరీరం నుండి టాక్సిన్లను తొలగించటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఆయుర్వేద వైద్యులు సైతం గోండ్ కటీనా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. గోండ్ కటీరాను పరిమితంగా తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.