అల్లం పాలలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో… మరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

ప్రతిరోజు ఒక గ్లాసుడు పాలు సేవిస్తే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్ ,మినరల్స్, లిపిడ్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతిరోజు మనం తీసుకునే పాలల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్న అల్లం రసాన్ని కలిపి సేవిస్తే సీజనల్గా మన ఇమ్యూనిటీ సిస్టం పై దాడి చేసే బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ప్రతిరోజు అల్లం పాలను సేవించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ముందుగా రుచికరమైన అల్లం పాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. చిక్కని పాలల్లో తగినంత చక్కెర లేదా తేనెను కలుపుకొని అందులో చిటికెడు అల్లం ముక్కను బాగా దంచి పాలల్లో వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టుకంటే రుచికరమైన అల్లం పాలు తయారైనట్లే. షుగర్ వ్యాధిగ్రస్తులైతే చక్కెరకు బదులు బెల్లంను వాడవచ్చు.

అల్లం పాలను ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తే చలికాలంలో బాగా ఇబ్బంది పెట్టే గొంతు ఇన్ఫెక్షన్లు, శ్వాస ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడి దగ్గు ,జలుబు,కఫం, గొంతు నొప్పి ముక్కు కారడం వంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. రోజూ అల్లం పాలు తాగితే జీర్ణ వ్యవస్థ బలపడి మలబద్ధకం, అజీర్తి, యాసిడ్ వంటి సమస్యలు దూరమౌతాయి.అల్లంలో ఉండే థ‌ర్మోజెనిక్ గుణాలు చలికాలంలో మ‌న‌ల్ని వెచ్చ‌గా ఉంచి శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేయడంతో పాటు జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. అల్లం లోని యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.అల్లం పాలలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో… మరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?