వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ముఖ్యంగా చిన్నపిల్లల్లో కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు, అలర్జీలు అధికంగా వ్యాపిస్తున్నాయి. చిన్నపిల్లల కంటి విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చిన్న పిల్లల వైద్య నిపుణులు సూచించడం జరిగింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే మీ పిల్లల కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు అధికం అయ్యి చిన్న వయసులోనే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే రోజువారి ఆహారంలో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్న పండ్లు కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
చిన్నపిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, పిజ్జా ,బర్గర్ వంటివి తినడానికే ఇష్టపడుతుంటారు. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు లేకపోగా దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.పిల్లల రోజువారి ఆహారంలో పుష్కలంగా విటమిన్ ఏ, విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, ల్యూటిన్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు సమృద్ధిగా లభించే క్యారెట్లను రోజువారి ఆహారంలో ఉండునట్లు చూసుకోవాలి. క్యారెట్ లో ఉన్న ఔషధ గుణాలు కంటి అలర్జీలను తగ్గించి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
శీతాకాలంలో ఎక్కువగా లభించే చిలగడ దుంప లేదా స్వీట్ పొటాటో ను రోజువారి ఆహారంలో పిల్లలకు తినిపిస్తే వీటిలో సమృద్ధిగా లభించే విటమిన్ ఏ, సి,డీ, కెరోటిన్, బి కాంప్లెక్స్ కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది.క్యాప్సికంలో ఉన్న బయోటిన్ గుణాలు, గ్రీన్ యాంటీ ఆక్సిడెంట్లు కంటి కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. క్యాప్సికం పిల్లలకు ఇష్టమైన వెజిటేబుల్ పలావ్, సలాడ్ రూపంలో తినిపిస్తే ఇష్టంగా తింటారు. ప్రతిరోజు పాలకూర సూప్ పిల్లల చేత తాగిస్తే విటమిన్ ఏ విటమిన్ సి క్యాల్షియం ఐరన్ జింకు వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే బచ్చలి కూరను తప్పనిసరిగా రోజువారి ఆహారంలో చేర్చుకుంటే సంపూర్ణ పోషకాలు సమృద్ధిగా లభించి పిల్లలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు.