చెంచాలతో ఆహారాన్ని తీసుకుంటున్నారా.. ఆరోగ్యానికి ఏకంగా ఇంత నష్టమా?

ఒకప్పుడు అందరూ ఆహారం చేత్తో తీసుకునే వాళ్ళు. కానీ కాలం మారుతున్న కొద్దీ పద్ధతులు కూడా మారిపోయాయి. ఇప్పుడు అందరూ స్పూన్ల తో తినటం అలవాటు చేసుకున్నారు. కానీ ఆహారం చేతితోనే తింటే అది సంతృప్తి. అంతేకాకుండా మంచి ఆరోగ్యం అని కూడా చెప్పాలి. ఒకప్పుడు అందరూ చేతితో తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండేవాళ్లు.

 

నిజానికి చేతితో అన్నం తినటం వల్ల శరీరానికి మంచి మేలు చేస్తుంది. అంతే కాకుండా తీసుకునే ఆహారం కూడా రుచిగా ఉంటుంది. మామూలుగా చేతిలో ఉన్న ఐదు వేలు ఒక్కొక్క చిహ్నాన్నికి గుర్తని చెప్పాలి. అంటే బొటనవేలు ఆకాశంగా, చూపుడువేలు గాలిగా, మధ్య వేలు అగ్నిగా, ముందరపు వేలు నీటికి చిహ్నంగా, చిటికెన వేలు భూమికి చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఆహారాన్ని చేతితో తాకినప్పుడు.. మొదట ఆహారం తీసుకుంటున్నామని మెదడు అప్రమత్తం చేస్తుంది.

 

దానివల్ల శరీరంలో జీర్ణవ్యవస్థ ప్రక్రియ సాఫీగా సాగుతుందని అర్థమవుతుంది. అంతేకాకుండా చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇక గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక ముఖ్యంగా ఆహార ప్రక్రియ మందగిస్తుంది. ఆహారం గ్లైసేమిక్ సూచిక తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

 

చేతితో ఆహారం తీసుకోవడం వల్ల ప్రయోజకరమైన బ్యాక్టీరియా ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి చెంచాలతో అన్నం తినేవాళ్లు చేతితో తినడం అలవాటు నేర్చుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు అని తెలుస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు చెంచాలతో తినడం అలవాటు చేసుకున్నారు. అందుకే వారికి రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి.