మనం చేసే ప్రతి పనికి చేతి వేళ్ళు ఉపయోగించక తప్పదు. మరి అలాంటి చేతి వేళ్లలో ఏదైనా వాపు, నొప్పి వంటిది కలిగినప్పుడు చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా అసాధ్యం అవుతుంది. చాలా చిరాకుగా కష్టంగా ఉంటుంది. దీనికి కారణం శరీరంలోని హార్మోన్లు ఇంకా శరీరంలోని ఉష్ణోగ్రత కారణం కావచ్చు. శరీరంలో ఉప్పు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఫంగస్ ఇన్ఫెక్షన్ వంటి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా చేతివేళ్లలో వాపు నొప్పి వంటిది రావడం జరుగుతుంది.
హైడ్రో థెరపీ ద్వారా చేతి వేళ్లలో ఉన్న నొప్పి, వాపును సులువుగా తగ్గించుకోవచ్చు. రెండు వేరువేరు గిన్నెలు తీసుకొని ఒక దానిలో సాధారణ నీరు, మరోదానిలో గోరువెచ్చని నీరు తీసుకొని, గోరువచ్చని నీటిలో నాలుగు నిమిషాలు ఆ తర్వాత చల్లని నీటిలో ఒక నిమిషం ఉంచాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేసినట్లయితే సులువుగా నొప్పి, వాపు తగ్గించుకోవచ్చు. ఆవ నూనెను గోరువెచ్చగా వేడి చేసి ఐదు నిమిషాల పాటు చేతి వేళ్లను మర్దన చేసుకుంటే కండరాలలో నొప్పి పోయి రక్త ప్రసన్న బాగా జరిగి నొప్పి, వాపు కు ఉపశమనం కలుగుతుంది.
చేతి వేళ్లకు వ్యాయామం చేయాలి. ఒక చెయ్యి పిడికిలి గట్టిగా నొప్పి ఉన్న చేతివేళ్లును పట్టుకోవాలి. ఒక నిమిషం తర్వాత పిడికిలి తీసేయాలి. ఇలా రోజుకు వీలైనన్నిసార్లు చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి కండరాలలో నొప్పి తగ్గి వాపు తగ్గుతుంది. ఎప్సోమ్ ఉప్పులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. వేడి నీటిలో రెండు స్పూన్ల ఉప్పును వేసి అందులో పది నిమిషాలు నొప్పి ఉన్న వేలును ఉంచినట్లయితే అది నొప్పి,వాపును తగ్గిస్తుంది.
పసుపులో యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇన్ఫ్ల మేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ఒక స్పూన్ ఆలివ్ నూనెలో అర స్పూన్ పసుపు కలిపి నొప్పి ఇంకా వాపు ఉన్నచోట రాసుకోవాలి. అది పొడిబారిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ లో అధిక పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేయండి తర్వాత టవల్ తీసుకొని అందులో ముంచి పిండి ఆ టవల్ నుచేతికి నొప్పి ఉన్నచోట కట్టుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
చేతి వేళ్లలో ఉండే నొప్పి, వాపు కు ఐస్ క్యూబ్స్ ను ఒక టవల్ లో చుట్టి అక్కడ మర్దన చేయడం వల్ల త్వరగా ఉపశమనం వస్తుంది. చేతి వాపు లేదా నొప్పి ఒక కీటకం ద్వారా సంభవించినట్లయితే కలబందతో అక్కడ కాసేపు మర్దన చేస్తే సరిపోతుంది. చేతి వేళ్లలో నొప్పి ఇంకా వాపు రాకుండా ఉండాలంటే అధిక ఉప్పును వాడడం తగ్గించుకోవాలి. చూశారుగా ఈ టిప్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి.