గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

900x500_banner_HK-Connect_How-to-Improve-Heart-Health-_-Points-To-Keep-In-Mind

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో గుండె సంబంధిత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. గుండె సంబంధిత సమస్యల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేయించుకోవడంతో పాటు నూనెతో వండిన ఆహారాలకు దూరంగా ఉంటే గుండె సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వార ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బీపీ, షుగర్, ఒబెసిటి లాంటి సమస్యలను వ్యాయామం చేయడం ద్వారా సులభంగా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది.

కొన్ని ఆహార పదార్థాలను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండే పాలకూరను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు దూరమవుతాయి. చియా, అవిసె గింజలు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్, ప్రోటీన్స్‌ ఫిష్ ద్వారా లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పులతో చేసిన వంటకాలను తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. పప్పులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. నారింజ పండ్లు తీసుకోవడం ద్వారా కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు.

సడెన్ కార్డియాక్ అరెస్ట్ ప్రస్తుతం ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతోందనే సంగతి తెలిసిందే. సోడియం, కొలెస్ట్రాల్ ఫుడ్స్‌ని తగ్గించి విటమిన్లు, ఖనిజాల్, గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. గుండె సంబంధిత సమస్యలు కొన్నిసార్లు ప్రాణాలకు అపాయం కలిగించే ఛాన్స్ అయితే ఉంటుంది.