మీ గుండెల్లో మంటగా ఉందా.. గుండె మంటకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో గుండె మంట సమస్య వేధిస్తుంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా కొన్నిసార్లు ఈ సమస్య వల్ల ప్రాణాలకు అపాయం కలిగే అవకాశం అయితే ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు, పడుకునే విషయంలో చేసే తప్పులు సైతం గుండె మంటకు కారణమవుతాయి. గుండెల్లో మంటకు తీసుకునే ఆహారాలు సైతం కొన్ని సందర్భాల్లో కారణమయ్యే అవకాశం ఉంటుంది.

టమాటాలు, ఆల్కహాల్, సిట్రస్ జ్యూస్ తో పాటు ఉల్లిపాయలు, సిట్రస్ ఫ్రూట్స్, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల గుండెల్లో మంటకు చెక్ పెట్టవచ్చు. బచ్చలికూర, బీన్స్, ఓట్స్, బ్రౌన్‌రైస్, తృణధాన్యాలు, చిలగడదుంపలు, క్యారెట్లు, బీట్‌రూట్స్ తీసుకోవడం ద్వారా గుండె మంట సులువుగా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆహారాన్ని నిదానంగా తినడం ద్వారా యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించవచ్చు.

పని ఒత్తిడి, అధిక మసాలలు, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం కూడా గుండెల్లో మంటకు కారణమవుతుందని చెప్పవచ్చు. చల్లని పాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు చల్లటి పాలను తాగితే మంచిది. గూస్బెర్రీని తినడం ద్వారా గుండె మంటకు చెక్ పెట్టవచ్చు. శరీరంలోని అనేక ఇతర వ్యాధులను తొలగించడంలో ఆమ్లా తోడ్పడుతుంది.

అరటిపండ్లు తినడం వల్ల ఛాతీలో మంట తగ్గే అవకాశం అయితే ఉంటుంది. పాలు, అరటిపండ్లు కలిపి తీసుకున్నా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. గుండెల్లో మంటతో బాధ పడుతున్న వాళ్లు ఓమా వేడి నీటిని తీసుకుంటే మంచిది. ఓమాలో బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఏలకులకు దూరంగా ఉండటం వల్ల కూడా గుండెల్లో మంటకు చెక్ పెట్టవచ్చు.