చికెన్, మటన్ కంటే చేపలే మేలు.. చేపల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?

fish-sustainanbel-759

మనలో చాలామంది చేపలు తినడాన్ని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్, మటన్ తినడం కంటే చేపలు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. చేపలలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లకు అడ్డుకట్ట వేయడంలో చేపలు ఎంతగానో సహాయపడతాయి.

చేపలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గించడంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉపయోగపడతాయి. చేపలలో ఉండే కొన్ని హార్మోన్లు డిప్రెషన్ ను తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయి. స్త్రీలలో పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడంలో చేపలు ఉపయోగపడతాయి. చేపలలో శరీరానికి అవసరమైన 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి.

కంటిచూపును మెరుగుపరచడంలో చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలు తినడం వల్ల నిద్ర సంబంధిత సమస్యలు సులువుగా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. మధుమేహంతో బాధ పడేవాళ్లు చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. పిల్లలలో ఆస్తమా సమస్యకు చెక్ పెట్టడంలో చేపలు తోడ్పడతాయని చెప్పవచ్చు. చేపల్లో ఉండే ఐరన్ వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

చేపలు పరిమితంగా తినడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప నష్టం లేదు. చేపలు వాపును తగ్గించడంతో పాటు మెదడు, నాడీ వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. అల్జీమర్ సమస్య బారిన పడకుండా చేయడంలో చేపలు ఉపయోగపడతాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో చేపలు ఉపయోగపడతాయి.