వెన్ను నొప్పి సమస్య తరచూ వేధిస్తోందా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యకు చెక్!

మనలో చాలామందిని ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యలలో వెన్ను నొప్పి ఒకటి.. ఈ సమస్య చిన్నదిగా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కంప్యూటర్, ల్యాప్ టాప్ ముందు ఎక్కువ సమయం పని చేసేవాళ్లను సైతం కొన్నిసార్లు వెన్ను నొప్పి వేధించే అవకాశం అయితే ఉంటుంది. కొన్నిసార్లు గాయాల వల్ల కూడా వెన్ను నొప్పి బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వీలైనంత వరకు మందుల ద్వారానే ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నిద్రలేమి వల్ల కూడా వెన్ను నొప్పి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కంటికి సరిపడా నిద్ర పోవడం ద్వారా ఈ సమస్య దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. వెన్ను నొప్పితో బాధ పడుతున్న సమయంలో సహజసిద్ధమైన నూనెలు రాయడం ద్వారా కూడా సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది.

కొన్నిసార్లు వెన్ను నొప్పి వల్ల రాత్రి సమయంలో నిద్రపోలేని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నొప్పి ఎక్కడ ఉందో అక్కడ మసాజ్ చేయించుకోవడం ద్వారా సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. ధ్యానం చేయడం ద్వారా ఆందోళన, ఒత్తిడి తగ్గి వెన్ను నొప్పి దూరమయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. సహజ పదార్థాలతో చేసిన నూనెలను వేడి చేసి రాయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.

నొప్పిని తగ్గించుకునే వ్యాయామాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే మందులు వాడటం మంచిది. అప్పటికీ మంచి ఫలితాలు రాకపోతే మాత్రం వైద్యులను సంప్రదించి మందులు లేదా ఆపరేషన్ ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.