హై బీపీ సమస్యను తరిమికొట్టే. అద్భుతమైన చిట్కాలివే?

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన లవంగం మన ఆహారంలో రుచిని, సువాసన ఇవ్వడంతో పాటు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే అద్భుతమైన ఒక సుగంధ ద్రవ్యం. లవంగంలో మన సంపూర్ణ ఆరోగ్యాని కాపాడే ఔషధ గుణాలతో పాటు శరీర పోషణకు అవసరమైన విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ తో పాటు ఐరన్,కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం,మాంగనీస్,వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక లవంగం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయాన్నే ఒక లవంగాన్ని తింటే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు, విటమిన్ సి కణాల అభివృద్ధికి సహాయపడి మన శరీరంలోని చెడు మలినాలను తొలగించడంతోపాటు మనలో ఇమ్యూనిటీ సిస్టంలో అభివృద్ధి చెంది అనేక మొండి వ్యాధులను నిర్మూలించడంలో సహాయపడుతుంది. అలాగే లవంగం లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన నోట్లో ఉన్న చెడు మలినాలను తొలగించి దుర్వాసన తొలగించడంతోపాటు చిగుళ్ళను,దంతాలను దృఢంగా ఉంచుతుంది.

కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధులతో బాధపడేవారు బాధపడేవారు లవంగం ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా ఉన్న క్యాల్షియం ఫాస్ఫరస్ వంటి మూలకాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతారు. అలాగే వీటిలో పుష్కలంగా ఉన్న పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణాశయ క్యాన్సర్లను తొలగించడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని క్యాన్సర్ గణాలను నాశనం చేసి అనేక క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేసి కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించడంలో లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. కావున ప్రతిరోజు లవంగాన్ని ఆహారంగా తీసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి అధిక రక్తపోటు సమస్యను దూరం చేసి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి ఉబకాయం, అతి బరువు సమస్య దరి చేరవు. రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో లవంగం అద్భుతంగా పనిచేస్తుంది.

మోతాదుకు మించి లవంగాన్ని ఆహారంగా ఉపయోగిస్తే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని కల్పించవచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి సమస్యలతో బాధపడేవారు లవంగం వంటి మసాలా దినుసుల్ని తక్కువగా తినడమే మంచిది.